ప్రస్తుతం ఉన్న స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాము. ఒక విధంగా చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడిపేస్తూ ఉంటారు.ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ క్లాసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే మనం ప్రతి ఒక్కటి కూడా మొబైల్ నే ఉపయోగిస్తూ ఉన్నాము. అందుచేతనే మొబైల్ ని మనం కొద్దిసేపు ఉపయోగించకుండా ఉండలేము అని చెప్పవచ్చు. అయితే మొబైల్స్ వల్ల ఎంతటి లాభాలు ఉన్నాయి అంతే నష్టాలు ఉన్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. మరి మొబైల్ ని ఉదయం లేవగానే చూస్తే ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ని చూడడం ఒక అలవాటుగా ఉంటుంది.ఇలా చేయడం వల్ల మొబైల్ కు సంబంధించిన లైటింగ్ నేరుగా కలపైన పడి పలు రకాల కంటి సమస్యలకు దారి తిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక రాత్రి పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ ని చూస్తే మొబైల్ లైటింగ్ వల్ల కళ్ళు మందడం వంటివి జరుగుతాయి.


ఇలా రాను రాను కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఉదయం లేవగానే మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల మెదడుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక అంతే కాకుండా ఏకాగ్రత తో పనిచేయడం వంటివి చేయవలసిన పనులను కూడా చేయలేరు. అందుచేతనే ఉదయం లేవగానే మొబైల్ ను చూసి అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సాధ్యమైనంతవరకు మొబైల్ కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: