జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమయ్యే ఇనుమును దీని ద్వారా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ జీరాలో 1.4 మి.గ్రా ఇనుము కలిగి ఉంటుంది.ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల జీర్ణమైన ఆహారం శరీరానికి అవసరమైనంత ఉపయోగించుకొని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేయడంలో జీలకర్ర మంచి ఔషదమని చెబుతున్నారు.