సెక్స్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండేదే. భార్య భర్తల దాంపత్యాన్ని సుఖమయం చేయడంలో కీలక పాత్రని పోషిస్తోంది. ఇక మన భారతదేశంలో సెక్స్ అంటేనే చాలా మంది ఓ పెద్ద నేరంగా చూస్తారు. అలాగే దాని గురించి చర్చించుకోవడం కూడా చాలా తప్పుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది వారికి ఉన్న అనుమానాలను కూడా దాచేసుకుంటారు. చిన్న సమస్యని కూడా పెద్దగా ఆలోచిస్తూ బ్రమలో బ్రతుకుతుంటారు. ముఖ్యంగా అబ్బాయిల్లో ఉండే సాధారణ అపోహలేంటో చూద్దాం...
పురుషాంగం చిన్నగా ఉండడం వల్ల భార్యలను సంతృప్తి పరచలేమేమో అన్న అపోహలో చాలా మంది ఉంటారు. దాదాపు నూటికి డభై శాతం మంది మగవారు ఇలానే ఆలోచిస్తారు. నిజానికి..పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధమూ లేదు. సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం ఒక కళ. ఆ విషయాలు తెలియాలి తప్పించి పురుషాంగం పెద్దది చిన్నది అని కాదు. ఏ స్త్రీ అయినా సరే ముందు ఫోర్‌ప్లే చేసిన తర్వాత అసలు శృంగారంలోకి దిగాలి. అప్పుడే స్త్రీ పూర్తి సంతృప్తి చెందుతుంది.
మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి.. ఆమెను అర్థం చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. శీఘ్రస్ఖలనమూ బాధిస్తోంది.’ ఈ సమస్యకూడా చాలా మందికి ఎదురౌతూ ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్లయితే మీరు సెక్స్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నట్లే. ఎలాంటి అపోహలు లేకుండా మీరు సుఖసంపారాన్నిచేయవచ్చు.