షుగర్ ఉండే తియ్యని పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకునేలా ప్రయతించాలి.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు.. అయితే వీళ్ళు అందరి వాళ్ళు లాగా అన్నీ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.. వారు షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా డైట్ ను కూడా కంట్రోల్ చేసుకోవాలని చెబుతున్నారు..



షుగర్ ఉన్న వాళ్ళు తేనెను తీసుకోవచ్చా లేదా అనేది చాలా మందిని వేధిస్తున్న ఆలోచన . అయితే తేనెను తీసుకోవడం వల్ల ఏదైనా సమస్య ఉందా? ఉంటే ఎటువంటి సమస్యలు? అనేది ఇప్పుడు చూద్దాం..నిపుణుల అభిప్రాయం ప్రకారం పంచదార బదులు తేనె వాడడం వల్ల వచ్చే లాభం పెద్దగా ఏం లేదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెండూ ఎఫెక్ట్ చేస్తాయి. అయితే, పంచదార కంటే తేనె ఎక్కువ తియ్యగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె కలిపితే సరిపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు..తేనెలో కొంచెం మినరల్స్ ఎక్కువ గా ఉంటాయి. కాబట్టి ఫిట్నెస్ మీద దృష్టి పెట్టేవాళ్ళకి బావుంటుంది కానీ, డయాబెటిక్స్ మాత్రం తేనె నుండి కూడా దూరంగా ఉండాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 



బ్లడ్ షుగర్ ఉండడమే మంచిది కాదంటే, అందులో ఫ్లక్చుయేషన్స్ ఉండడం ఇంకా మంచిది కాదు. ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ యొక్క ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అతని షుగర్ లెవెల్స్ ను బట్టి తేనెను తీసుకోవాలా లేదా అనేది డాక్టర్ ను అడిగి మరి తీసుకోవడం మంచిదని అంటున్నారు.. కాఫీ, టీ లో ఒక టీ స్పూన్ తేనె వేసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అంతగా తేనె తీసుకోవాలనుకుంటే రా ఆర్గానిక్ హనీ ని లెమన్ జ్యూస్ లో కలిపి కొద్దిగా తీసుకోవడం మంచిదని అంటున్నారు.. ఏది ఏమైనా కూడా డాక్టర్ ను అడిగి తీసుకోవడం మంచిది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: