ధాన్యాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు.. వాటిలో శరీరానికి కావలసిన అన్నీ రకాల ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. న్యాచురల్ గా వీటిలో కొవ్వు ను కరిగించే
శక్తి ఉంటుంది. మొలకలు కట్టుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తక్కువ ధరలో దొరికే వీటిలో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. పూర్వ కాలంలో వీటితో చేసిన వంటలను చేసుకొని తినేవాళ్ళు అందుకే ఇప్పటి వరకు ఆరోగ్యంగా బ్రతికి ఉన్నారు. దాంతో అప్పటి ఆహారం అంటూ మళ్లీ వాటి వెనక పడ్డారు. సజ్జలు ముఖ్యంగా పోషకాలకు నిలయం అని చెప్పాలి. వీటితో రొట్టెలు, కుడుములు, గారెలు, బూరెలు వంటి వాటిని చేసుకోవడం చూసే ఉంటాము.. ఇప్పుడు మరో కొత్త వంటను అదే పరోటా ను కూడా చేసుకుంటారు. ఆలూ పరోటా ను కూడా చేస్తారట.. ఇంక ఆలస్యం లేకుండా ఆ పరోటాను ఎలా చేసుకోవాలి.. ఏ పదార్థాలను వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
సజ్జ పిండి: రెండు కప్పులు,
గోధుమపిండి: అర కప్పు,
ఉడికించి చిదిమిన ఆలుగడ్డ: ఒక కప్పు,
మెంతికూర లేదా కొత్తిమీర: అర కప్పు,
కారం: అర టీ స్పూన్,
పసుపు: పావు టీ స్పూన్,
అల్లం తరుగు: ఒక టీ స్పూన్,
జీలకర్ర: ఒక టీ స్పూన్,
వాము: పావు టీ స్పూన్,
చాట్ మసాలా: అర టీ స్పూన్,
ఉప్పు: తగినంత,
నూనె: సరిపడా
తయారీ విధానం:
ఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి, గోధుమ పిండి, ఆలుగడ్డ ముద్ద, మెంతికూర లేదా
కొత్తిమీర,
పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం తరుగు,
జీలకర్ర, వాము, చాట్
మసాలా వేసి కలపాలి.గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలిపి పావుగంటసేపు పక్కనపెట్టాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని కాస్తంత మందంగా వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకున్నాక, ఒక్కో పరాటాను పెనంపై
నూనె చల్లుతూ రెండువైపులా కాల్చాలి. ఈ సజ్జ ఆలూ పరాటాలను చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి.