సోయా వల్ల ఆరోగ్యాని కి చాలా మంచిది.. ఎన్నో పోషకాలు ఈ సోయా లో దాగి ఉన్నాయి. అందుకే సోయాని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఎప్పుడూ చేసుకొనే వంట కాకుండా వెరైటీ గా చేసుకోవాలని అనుకునేవారు పరోటా ను ఒకసారి ట్రై చేయండి.. వీటిని ఇలా చేసుకొని పిల్లలకు  పెడితే చాలా ఇష్టంగా తింటారు.. ఎన్నో పోషకాలు దాగివున్నాయి. అందుకు కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


కావలసిన పదార్థాలు..

గోధుమ పిండి: 2 కప్పులు,

సోయా: 1/4 కప్పు,

క్యాబేజీ తురుము: అరకప్పు,

 బంగాళ దుంపలు: రెండు,
 
పచ్చి మిర్చి పేస్ట్‌: 1 టీ స్పూన్‌,

పెసర పప్పు: 1/4 కప్పు,

పసుపు: 1 టీ స్పూన్‌,

ఉప్పు: తగినంత,

జీలకర్ర: 1 టీ స్పూన్‌,
 
 కొత్తిమీర తురుము: 1 టీ స్పూన్‌,
 
 నూనె: సరిపడా

తయారీ విధానం..

ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.. కాస్త వేడి అయ్యాక జీలకర్ర, ఉడికించి పెట్టిన క్యాబేజీ తురుము, పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేడి చేయాలి..పొడిచేసుకున్న సోయా, ఉడికించి మెదుపుకున్న బంగాళ దుంప వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించు కోవాలి.తర్వాత పచ్చి మిర్చి పేస్ట్‌, పసుపు, ఉప్పు, కొత్తి మీర వేసి బాగా ఉడికించాలి. అన్నీ బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి, అరగంట పాటు చల్లారనివ్వాలి. ఒక పాత్ర తీసుకుని గోధుమ పిండి, తగినంత ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుని.. చపాతీ కర్ర తో చపాతీలా చేసిన తర్వాత, దాని మధ్య లో ఫ్రై చేసి పెట్టుకున్న సోయా మిశ్రమం వేసి చపాతీని అన్ని వైపులా మూసేసి పరాటాలా చేసుకోవాలి. పరాటాలను పెనం పై రెండు వైపులా నూనె వేసి కాల్చుకుంటే సరి రుచికరమైన ఆరోగ్య కరమైన సోయా పరోటా రెడీ..

మరింత సమాచారం తెలుసుకోండి: