చిన్నారులు ఒత్తిడిని పట్టుకుంటారా..? దాని ప్రభావం వారి హెల్త్ మీద పడుతుందా..? వారు పెద్దవాళ్ళయ్యాక దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..? చిన్నారులు ఒత్తిడికి అలవాటు పడకుంటే వారు పెరుగుతున్న కొద్దీ ఈ ఒత్తిడి ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. దీని ద్వారా వారికి డయాబెటిస్, గుండె నొప్పి వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కొన్ని అధ్యయనాలు  చెబుతున్నాయి. కానీ కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు ఇలాంటి కష్టం ఏ తెలియకుండా చాలా గారాబంగా పెంచుతున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు భవిష్యత్తులో కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారని వారు భావిస్తారు. కానీ భావన తప్పని ఆస్ట్రేలియన్ పరిశోధకులు  తాజాగా చేసినటువంటి అధ్యయనంలో తెలిపారు.

చిన్నతనంలో ఏ కష్టాలు పడకుండా, ఎంతో గారాబంగా జీవించిన పెద్దవాళ్ళయ్యాక మాత్రం మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. సురక్షితమైన టువంటి బాల్యం వారు పెద్దయ్యాక రక్షిస్తూ ఉందని మనం చెప్పలేం..! ఆస్ట్రేలియా కాన్బెర్రా విశ్వవిద్యాలయం  ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ అధ్యయనంలో చిన్నప్పటి అనుభవాలు వారు పెద్దవాడయ్యాక ఎలా ప్రభావం చూపిస్తాయి..? అలాగే వారి ఆరోగ్యంపై కూడా ఈ ప్రభావం చూపిస్తాయా.. వంటి ప్రశ్నల పై అధ్యయనం చేశారు. దీని ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే బాల్యంలోని అనుభవాలు, సానుకూల అనుభవాలు వారు యుక్తవయసుకు వచ్చేసరికి మానసిక రుగ్మతలకు కారణంగా మారుతున్నాయని పరిశోధకులు అన్నారు.

 ఈ యొక్క అధ్యయనాన్ని ఆస్ట్రేలియా చెందినటువంటి నాలుగు నుంచి పదకొండేళ్ల మధ్య ఉన్నటువంటి 3,15,000 మంది బాలికలపై నిర్వహించామని, దీనిలో 50 శాతం మంది తాము యుక్తవయస్సు వచ్చాక మాకు మా జీవితంలో ఏదో ఒక మానసిక ఒత్తిడి కలిగి ఉందని, బాల్యంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదని, చిన్నప్పుడు ఎంతో సుఖంగా పడినటువంటి పిల్లవాడు కూడా, పెద్దయ్యాక మానసిక రుగ్మతలకు లోనయి అవకాశం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. యొక్క అధ్యయన ఫలితాలను కరెంట్ ఫిలాసఫీ అనే జర్నల్ లో రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: