కరోనా ఉద్ధృతితో అంతా స‌త‌మతం అవుతున్న త‌రుణాన మ‌రో భ‌యానక వేరియంట్ ఒక‌టి వెలుగు చూసింద‌ని చైనా నుంచి స‌మాచారం అందుతోంది. దీనిని వూహాన్ సైంటిస్టులు ధ్రువీక‌రించారు.నియోకొవ్ పేరిట గుర్తించిన ఈ వేరియంట్ ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటుంద‌ని, మ‌ర‌ణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంద‌ని డ్రాగ‌న్ కంట్రీ సైంటిస్టులు అప్పుడే భ‌యాందోళ‌న‌ల‌తో కూడిన ప్ర‌క‌టన‌లు ఇస్తున్నారు.


ఇవి అక్క‌డ ల్యాబ్ లో ఉన్న ఏ టీకాకు కూడా లొంగ‌డం లేద‌ని కూడా చెబుతున్నారు.దీంతో  మ‌ళ్లీ ప్ర‌పంచం డైలమాలో ప‌డిపోయింది. ఇప్ప‌టికే ఒమిక్రాన్ వేరియంట్  కార‌ణంగా వ్యాధి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ పేరిట క‌ఠిన రీతిలో నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొన్ని చోట్ల పాజిటివిటీ రేటు ఆందోళ‌న‌కరంగానే ఉంది. ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి కాకూడ‌ద‌నే త‌ప్ప‌క కొన్ని స‌డ‌లింపులు ఇస్తున్నారు.ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు పాఠ‌శాల‌ల విష‌య‌మై ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాయి.


ఢిల్లీలో నిన్న‌నే వీకెండ్ క‌ర్ఫ్యూ పై ఆంక్ష‌లు స‌డలించారు కానీ మిగ‌తా రోజుల్లో నైట్ క‌ర్ఫ్యూ అలానే ఉంటుందని తేల్చారు. అయితే ఇక్క‌డ కూడా పాఠ‌శాల‌లు తెర‌వ‌డంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎటువంటి ప్ర‌క‌ట‌న‌నూ జారీ చేయ‌లేదు. ఇక ప‌శ్చిమ బెంగాల్ లో అయితే ఓపెన్ స్కూల్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ.త‌మిళ‌నాడులో కూడా ఆంక్ష‌లు అమ‌ల‌వుతున్నాయి. తెలంగాణ‌లో ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ బ‌డుల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు అక్క‌డి సీఎం కేసీఆర్.ఆంధ్రాలో కూడా ఆంక్ష‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో ఆర్థికంగా అస్స‌లు బాలేని ప‌రిస్థితుల్లో మ‌రో వేరియంట్ ప్రపంచంపై దాడి చేస్తుంద‌ని వూహాన్ ల్యాబ్ ప్ర‌క‌టించ‌డం మ‌రో విధ్వంసానికి తెర తీయ‌డ‌మే అని స్ప‌ష్టం అవుతోంది. మ‌రోవైపు నియోకొవ్ వేరియంట్ గురించి శాస్త్ర‌వేత్త‌లు మ‌రో మాట చెబుతున్నారు. ఇదేమీ కొత్త‌ది కాద‌ని తేల్చేస్తున్నారు. ఇప్ప‌టిదాకా ఇది మ‌నుషుల‌కు సోకే విష‌య‌మై ఎటువంటి నిర్థార‌ణ లేద‌ని అంటున్నారు.జంతువుల్లో తాము గుర్తించామ‌ని కూడా అంటున్నారు.తొలిసారి ద‌క్షిణాసియాలో ఇది వెలుగు చూసింద‌ని, పాత వేరియంటే కానీ గ‌బ్బిల్లాల్లో గుర్తింపున‌కు ఇది నోచుకుంద‌ని కూడా చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: