సాధారణంగా డబ్బు ఉంటే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు మనకు కావాల్సింది కొనుగోలు చేయవచ్చు సాదాసీదా జీవితం కాదు ఎంతో విలువైన బ్రాండెడ్ దుస్తులు ధరించి అందరికీ మా దగ్గర డబ్బు ఉంది అన్నది డ్రెస్సింగ్ స్టైల్ తోనే చెప్పవచ్చు. మనకు నచ్చిన విధంగా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చు అని అనుకుంటూ ఉంటారు సామాన్యులు. కానీ అటు బిలియనీర్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు.  ముఖ్యంగా వారు ధరించే దుస్తువులు ఎంతో మందిని షాక్ అయ్యేలా చేస్తూ ఉంటాయి.


సాధారణంగా డబ్బున్న వాళ్ళు వేసుకునే దుస్తుల విషయంలో సామాన్యుల అందరికీ ఒక డౌట్ ఎప్పటినుంచో ఉంది. ఎందుకు ఎక్కువగా డబ్బున్న వారు ఖరీదైన దుస్తులు ధరించరు. సామాన్యులు ఏమో పైకి తమకు డబ్బు ఉందని అందరికీ చూపించుకోవడానికి ఖరీదైన దుస్తులు ధరించడానికి ఇష్టపడతా ఉంటే బిలియనీర్లు  మాత్రం సాదాసీదా దుస్తుల్లోనే కనిపిస్తూ అప్పుడప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బిలియనీర్లు ఇలా ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు జోలికి ఎందుకు పోరు అన్నది చాలా మంది లో ఉన్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రశ్నకు ఇక్కడ ఒక బిలియనీర్  ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. బిలియనీర్స్ బ్రాండెడ్ దుస్తులు కాకుండా సాధారణ దుస్తులు ధరిస్తారు ఎందుకు అని ఆర్ పి జి  చైర్మన్ హర్ష గొయంకా ఒక బిలియనీర్ ను అడిగాడు.  ఇక ఆయన చెప్పిన ఆన్సర్ మాత్రం అందరిని ఆలోచింప చేస్తుంది అని చెప్పాలి.  ఉతుకునే దుస్తులపై లక్షలు వెచ్చించడం వృధా. ఎంత ఖరీదైన బట్టలు అయినా సరే పాడైపోతుంటాయ్. అదే ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ పై పెడితే లేదా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది. అయితే నేను ఎలాంటి వాడిని అన్న విషయాన్ని నా పని నిర్ణయిస్తుంది. అంతే కానీ నా బ్రాండెడ్ దుస్తులు కాదు అంటూ సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: