ఓట్స్ ని రోజు అల్ప ఆహారంగా తీసుకోవడం మంచిదే కానీ ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకూడదట.. అందుచేతనే ప్రతిరోజు అల్పాహారంగా కాకుండా వారానికి రెండు మూడు రోజులు మాత్రమే తినడం చాలా మంచిది. దీనివల్ల పలు రకాల పోషకాలు అందడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుందట. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా చేస్తుంది.. దీని వలన కడుపులో గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని చాలా తక్కువగా తినడం మంచిదట.
ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన శరీరానికి ఎక్కువ తినగలిగేలా చేస్తుంది ఓట్స్ అతిగా తినడం వల్ల పనికి ఆటంకం కలిగిస్తుంది దీంతో చురుకుగా ఉండలేక పోతారు. అందుచేతనే ఓట్స్ ను ఎంత తక్కువ మొత్తంలో తింటే అంత మంచిది. సాధారణంగా డైట్ ఫాలో చేసేవారు ఎక్కువగా ఓట్స్ ను తింటూ ఉండడం జరుగుతుంది.. ఇలాంటి వారు కూడా వీటిని తగ్గించి తినడం చాలా మంచిదట. ఓట్స్ కు బదులుగా రాత్రి సమయాలలో గోధుమలతో ఆడించిన పిండితో చపాతీలు తినడం చాలా మంచిదట. దీనివలన ఆకలి వేయకుండా ఉండడమే కాకుండా బరువు తగ్గుతారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి