సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే చాలు కొంత ఆర్థికంగా స్థిరపడిన వారి ఇళ్లల్లో ఎక్కువగా ఎండ వేడిని తట్టుకోవడానికి ఏసి వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే ఈ ఏసి ని ఉపయోగించడం వల్ల కరెక్ట్ బిల్లు ఎక్కువగా వస్తుందని కానీ ఇది కచ్చితంగా వేడి నుంచి కాస్త ఉపశమనాన్ని అందిస్తుందని చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.. అయితే ఏసి వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల భారీ నష్టాన్ని చూడవలసి ఉంటుంది. అయితే ఏసి ఉపయోగించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కొంత మంది ఇళ్లల్లో ఏసీ ని అమర్చుకున్నప్పుడు వారు దానిని సరిగ్గా చూసుకుంటూ ఉండరు.. ఏసీ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిని శుభ్రంగా ఉంచడం అవసరం ఏసిని  రన్ చేసిన తర్వాత అందులో దుమ్ము దూళి పేరుకు పోతుంది. దీని వల్ల ఫిల్టర్ ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.. ఎక్కువ కాలం ఏసీని వాడుకోకుండా ఉన్నట్లు అయితే ఒక కవర్ ఏసీ కి చుట్టడం మంచిది.


ఎక్కువ కాలం నుంచి  ఏసీని ఆన్ చేస్తే దానికంటే ముందుగా సర్వీస్ చేయించడం చాలా మంచిది. ఇది ఏసీ లోపల ఉండేటువంటి మురికిని కూడా తొలగిస్తుంది.. ఏసీలోపల ధూళి ఉంటే మీరు దానిని ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల కంప్రెసర్ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


మీరు ఇంట్లో విండో ఏసిని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. వెంటిలేటర్ బాగా ఉండే చోట విండో ఏసిని అమర్చాలి.. విండో ఏసిని సరిగ్గా ఉండకపోతే దాని వేడి గాలి బయటికి రాదు.దీనివల్ల ఏసి దెబ్బతింటుందట.. ఏదైనా మురికి కాలువల దగ్గర విండో ఏసీ ని అమర్చకూడదు. ఇది గ్యాస్ కి హానికరంగా మారుతుందట.


ఏసీ ని ఎక్కువగా ఉపయోగించేవారు కచ్చితంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏసీ ని సర్వీసింగ్ చేస్తూ క్రమంగా చెక్ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: