రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా సుదీర్ఘకాలంగా ఎదురు చూసిన వైసీపీ మ్యానిఫెస్టో ఇటీవల వచ్చింది. ఈ క్రమంలో మ్యానిఫెస్టోపైక సర్వత్రా చర్చ మొదలైంది. కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో ఇంకా ప్రకటించకపోయినా చంద్రబాబు అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలతో వైసీపీ మ్యానిఫెస్టోని పోల్చి చూస్తున్నారు.  వీటి అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించుకుంటున్నారు. అయితే జగన్ హామీలపై ఆయా వర్గాలు నమ్మకంగానే ఉన్నారు.

దీనికి కారణం గతంలో ఇచ్చిన నవరత్నాలనే జగన్ ఈసారి నవరత్నాల ప్లస్ గా ప్రకటించారు. ఇవన్నీ పాత హామీలే. పైగా జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్నవే. మరోసారి అధికారంలోకి వస్తే వీటిని పెంచి అందిస్తానని చెబుతున్నారు. కానీ చంద్రబాబు వాటిపైనే ప్రజలకు విశ్వాసం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తాము చెప్పేదే చేస్తాం అని.. అలివి కానివి ఇవ్వలేమని సీఎం జగన్ సైతం పలు సభల్లో వ్యాఖ్యానించారు.


అయితే 2014 ఎన్నికల సమయంలో పలు ప్రజాకర్షక హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో ఇచ్చి చంద్రబాబు అమలు చేయని హామీలను ఓ సారి పరిశీలిస్తే.. పుట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డ పేరిట అర్హులైన వారికి రూ.30వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి రూ.2లక్షలను అందజేస్తామని తెలిపారు.


ఇంకా.. మహిళలకు స్మార్ట్ ఫోన్, హైస్కూల్, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తాం. వీటితో పాటు అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలు, బంగారం తాకట్టు వంటి వాటిని మాఫీ చేస్తామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలా లెక్కలేనన్ని హామీలను అమలు చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారా లేరా అని జనాలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: