ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగుచేస్తున్న పండ్లు. వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.   ఒకప్పుడు సీజనల్‌గా లభ్యమయ్యే కొన్ని పండ్లు ఈ రోజుల్లో అన్ని రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అన్ని పండ్లూ మంచివే కానీ ఒక్కో పండు ఒక్కో విధంగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలా ద్రాక్ష కూడా ఆరోగ్య రక్షణలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. మనిషికి ప్రధానమైన గుండె, రక్తం విషయంలో ద్రాక్ష పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు చర్మం, కేశాల సంరక్షణలోనూ ద్రాక్ష పండ్లు ఉపయోగపడతాయి. మ‌రి అదే ఎలాగో ఓ లుక్కేయండి..


- ద్రాక్షలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి.


- ద్రాక్ష‌లో పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కే చాలా ఎక్కువ. అధిర బ‌రువుతో బాధ ప‌డేవారు ద్రాక్ష‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.


-  ప్రతి రోజు ద్రాక్షరసం తాగడం వల్ల‌ మైగ్రేయిన్ తగ్గడానికి గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.


- ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.


- జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.


- ద్రాక్ష రసం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆల్కహాలు మీద ఆశ తగ్గి ద్రాక్ష లోని శక్తిని పొంది, రక్త శుద్ధి జరుగును.



మరింత సమాచారం తెలుసుకోండి: