వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆధిపత్య పోరు బాగా జరుగుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందటే...అది కర్నూలు జిల్లా నందికొట్కూరు(ఎస్సీ రిజర్వడ్) నియోజకవర్గమే. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పనిచేసిన తొగురు ఆర్థర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్థర్ నిదానంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఈయన మాట కంటే నియోజకవర్గ ఇన్‌చార్జ్ siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాటనే ఎక్కువ చెల్లుబాటు అవుతుంది. నియోజకవర్గంలో బైరెడ్డి చెప్పిన విధంగానే పనులు జరుగతాయి. అధికారులు బైరెడ్డి మాటకే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. ఇక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌గానీ, వైసీపీ పెద్దలు గానీ సిద్ధార్థ్‌కే మద్ధతు ఇస్తున్నారు.

 

దీంతో ఆర్థర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పేశారు. అయితే బైరెడ్డి ఆధిపత్యం ఇష్టపడని ఆర్థర్ వర్గం, ఎక్కడికికక్కడ బైరెడ్డి వర్గం చేసే పనులని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి కూడా. అయితే వైసీపీ అధిష్టానం వీరి పంచాయితీని సర్దిపుచ్చడానికి ప్రయత్నించినా, నిత్యం నియోజకవర్గంలో ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది.

 

మొన్న స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపిణీలో కూడా ఇరు వర్గాల మధ్య రగడ జరిగింది.  నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే చెరో మూడు మండలాల్లో అభ్యర్ధులని ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు నాలుగు మండలాల్లో సిద్ధార్థ్ చెప్పిన వారికి సీట్లు ఇచ్చారు. దీంతో ఆర్థర్ అసంతృప్తితో అన్నీ మండలాలు బైరెడ్డికే ఇచ్చేయమని చెప్పేసి సైడ్ అయిపోయారు.

 

మొత్తానికైతే పేరుకి నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉంటే, అనధికార ఎమ్మెల్యేగా siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉంటూ....అధికారం చెలాయిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు. ఇక త్వరలోనే బైరెడ్డికి జిల్లా స్థాయి పదవి వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ పదవి వస్తే బైరెడ్డికి తిరుగుండదు. 

 

ఇక వీరి ఆధిపత్య పోరులో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రభుత్వ పథకాలు మామూలుగానే అందుతున్నాయి. కాకపోతే ఇక్కడ టీడీపీ అడ్రెస్ లేదు. ఎన్నికల్లో ఓడిపోయినా జయరాజు యాక్టివ్‌గా లేరు. దీంతో ఇక్కడ టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లు వైసీపీ ఖాతాలోకే పోతాయి. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి నియోజకవర్గంలో బలమైన వాయిస్ వినిపిస్తోంది. సమస్యలపై బాగానే పోరాటం చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: