నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు.. తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి...తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి 1983, 1985 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరి 1989లో మళ్ళీ గెలిచారు.

ఇక ఆయన మరణంతో ప్రసన్న రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రసన్న టి‌డి‌పిలో చేరి రాజకీయం చేశారు. 1994, 1999 ఎన్నికల్లో కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2004లో ఓడిన ప్రసన్న...2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ తర్వాత టి‌డి‌పికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి కోవూరు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.

ఇక 2014లో ఓడిపోయిన ప్రసన్న...2019 ఎన్నికల్లో మరొకసారి గెలిచారు. అయితే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మొదటే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు...కానీ జిల్లాలో మేకపాటి కుటుంబానికి చెందిన గౌతమ్ రెడ్డికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ సారి విడతలో మాత్రం ప్రసన్నకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేగా కూడా ప్రసన్న మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడినా సరే, ప్రజలకు అండగా నిలబడటంలో ముందు ఉంటున్నారు.


కోవూరులో ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సొంత పార్టీ నేతలు తప్పు చేసిన కూడా ప్రసన్న ఊరుకోవడం లేదు. సొంత పార్టీ నేతల అవినీతి, అక్రమాలని సైతం ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రసన్నకు కోవూరులో ఎదురులేకుండా పోయింది. ఇక ప్రసన్నకు టి‌డి‌పి చెక్ పెట్టలేకపోతుంది. మాజీ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక్కడ పొలంరెడ్డిని వ్యతిరేకించే టి‌డి‌పి వర్గం కూడా ఉంది. గత ఎన్నికల్లోనే పొలంరెడ్డికి సీటు ఇవ్వొద్దని చేజర్ల వేంకటేశ్వరరెడ్డి వర్గం గట్టిగానే పోరాడింది. ఈ సారి కూడా పొలంరెడ్డిని సైడ్ చేయాలని చూస్తున్నారు. ఇలా టి‌డి‌పిలో ఉన్న గ్రూప్ తగాదాలు ప్రసన్నకు బాగా కలిసొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: