తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నట్లే ఉన్నాయి. కంచుకోటలో పుంజుకోవడానికి యనమల ఫ్యామిలీ నానా కష్టాలు పడుతుంది. అసలు ఒకప్పుడు తునిలో యనమలకు విజయాలే తప్ప పరాజయాలు తెలియవు. కానీ 2009 ఎన్నికల నుంచి సీన్ రివర్స్ అయింది. తుని ప్రజలు యనమల రామకృష్ణుడుపై విసుగు చెంది...కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.

సరే అంతటితో సరిపోతుందిలే అనుకుంటే...2014 ఎన్నికల్లో టీడీపీ గాలి ఉన్నా సరే తునిలో మాత్రం వైసీపీని గెలిపించారు. అప్పుడు టీడీపీ తరుపున యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేయగా, వైసీపీ తరుపున దాడిశెట్టి రాజా పోటీ చేశారు. ఇక రాజా ఎమ్మెల్యేగా గెలిచేశారు. కాకపోతే టీడీపీ అధికారంలోకి రావడం యనమల మంత్రి కావడంతో...తునిలో యనమల ఫ్యామిలీ హవా నడిచింది. వారే పెత్తనం చేశారు. ఆ పెత్తనం వల్లే మళ్ళీ 2019 ఎన్నికల్లో తుని ప్రజలు యనమల ఫ్యామిలీని ఓడించారు.

మళ్ళీ రాజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా రాజా తనకు సాధ్యమైన మేర పనులు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకెళుతున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అదనంగా ప్లస్ అవుతున్నాయి.  అంటే మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యేగా రాజా గొప్ప పనితీరు కనబర్చకపోయినా, పర్లేదు అనిపించుకునేలా పనిచేస్తున్నారు.

ఇలాంటి పరిస్తితుల్లో కూడా తునిలో యనమల ఫ్యామిలీ పికప్ అవ్వలేదు. అంటే తుని ప్రజలకు యనమల ఫ్యామిలీపై ఎంత ఆగ్రహం ఉందో అర్ధమవుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తుని ప్రజలు యనమల ఫ్యామిలీకి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా రాజాకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇంకా తునిలో యనమల ఫ్యామిలీ పరిస్తితి అస్సామే. మొత్తానికైతే తునిలో దాడిశెట్టి రాజాకు మాత్రం తిరుగులేనట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: