సాధారణంగా చాలామంది బయటకు వెళ్లలేక ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆడవారి కోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. అదే అప్పడాల వ్యాపారం.. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం భోజనంలో అప్పడం లేనిదే భోజనం పూర్తి కాదు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకే ఈ అప్పడాలకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ దీని కోసం ఒక ప్రాజెక్ట్ ను కూడా సిద్ధం చేసింది . అప్పడాల వ్యాపారం కోసం మీరు ప్రభుత్వం నుండి తక్కువ వడ్డీకే లోన్ పొందే అవకాశం ఉంటుంది.. ఇక ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


ముఖ్యంగా ఈ అప్పడాల వ్యాపారంలో మొదటిసారి 6 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి.  ఇక 30 వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో మీరు మొదలు పెట్టవచ్చు. ఇక ఈ సామర్థ్యం కోసం మీకు 250 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. ఇక ఇతర యంత్రాలు,  పరికరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో వర్కింగ్ క్యాపిటల్ లో మూడు నెలల జీతం,  మూడు నెలల వరకు ముడిసరకు,  యుటిలిటీ ఉత్పత్తి ఖర్చులు ఉంటాయి. అలాగే స్థలాన్ని అద్దెకు తీసుకుంటే అద్దె, విద్యుత్తు, నీరు మొదలైన వాటి బిల్లులు కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. కేంద్రం అందిస్తున్న ముద్ర పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలను లోన్ తీసుకొని మీరు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది.

ఇక మార్కెట్ నిపుణుల ప్రకారం ఆరు లక్షల పెట్టుబడి పెట్టడం వల్ల ప్రతినెల రూ.50 వేలకు పైగా లాభం పొందవచ్చు. ముఖ్యంగా ఖర్చులకు పోయి రూ.50,000 మిగులుతుంది అంటే ఇంతకంటే బెస్ట్ బిజినెస్ ఐడియా మరొకటి లేదని చెప్పాలి. ముఖ్యంగా ఇంట్లో ఖాళీగా ఉండే వారికి ఇదొక బెస్ట్ వ్యాపారం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: