ఈ మధ్యకాలంలో చాలామంది తమ డబ్బును సేవింగ్స్ ఖాతాలలో పొదుపు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు వడ్డీ రేట్లు పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. పొదుపు ఖాతాలు , ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ ఇతర స్కీములపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఇక అదేమిటంటే ప్రైవేటు రంగ బ్యాంక్ అయినా ఆర్బిఎల్ బ్యాంకు పొదుపు ఖాతా వడ్డీ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యాంకు అధికారిక వెబ్సైటు ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తాయి .ఈ మార్పు తర్వాత ఆర్బిఎల్ బ్యాంకు తన కస్టమర్లకు గరిష్టంగా 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇకపోతే ఆర్బిఎల్ బ్యాంకు పొదుపు ఖాతాలో లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసిన వారికి 4.25% వడ్డీ లభిస్తుంది. ఇక లక్ష రూపాయల నుండి రూ. 10 లక్షల వరకు ఉన్న డిపాజిట్లు పై 5.50% వడ్డీ ఇవ్వబడుతుంది. అలాగే 25 లక్షల పొదుపు ఖాతాలపై 6% వడ్డీ లభించగా రూ.25 లక్షల నుండి రూ.1 కోటి డిపాజిట్ లపై 6.25% వడ్డీ లభిస్తుంది.


ప్రస్తుతం రూ.5కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల డిపాజిట్ ల పై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లుగా పెంచారు.  అందుకే 6.25 శాతానికి వడ్డీ రేట్లు చేరుకోనున్నాయి. ఇకపోతే బ్యాంకు ఖాతాలో రోజు వారి బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ కూడా జోడించబడుతుంది. త్రైమాసిక ప్రాతిపదికన పొదుపు ఖాతా వడ్డీ ఖాతాలో జమ చేయబడుతుంది అని బ్యాంకు వెల్లడించింది. ఇకపోతే ప్రతి సంవత్సరం వడ్డీ డబ్బు జూన్ 30 , సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 , మార్చి 31 తేదీలలో జమ చేయబడుతుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: