తాజాగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ వారు శుభవార్త అందించారు.. స్కాలర్షిప్ పొంది ప్రతి నెల రూ.5000 ఉచితంగా పొందవచ్చుm ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఈ అవకాశం కల్పిస్తున్నారు..GEST - 2023 నీ.. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా స్కాలర్షిప్ లభిస్తుంది.

ఈ విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి తెలిపారు . ఫస్ట్ 10 ర్యాంక్స్ వచ్చిన బాలికలకు నెలకు రూ.5000 చొప్పున ఇస్తారు. నెక్స్ట్ 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3000 చొప్పున ఇస్తారు.  అంతేకాదు ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేదాకా ఈ డబ్బులు ఇస్తారట.  టెన్త్ చదివే బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది అని నారా భువనేశ్వరి వెల్లడించారు. నేటి నుండి అప్లై చేసుకోవచ్చని కూడా తెలిపారు అయితే ఈ అవకాశం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30/11/2022. కావున విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని కోరారు.

అయితే అప్లై చేసుకోవడానికి విద్యార్థులు.. www.ntrtust.org లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం.. 7660002627/ 7660002628 నెంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు. అయితే నెలకు 5000 రూపాయల చొప్పున లభించడం అంటే అంత ఆషామాషీ కాదు.  కాబట్టి విద్యార్థినిలు తమ టాలెంటును ఉపయోగించి ఈ స్కాలర్షిప్ పొందాలని ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు స్కాలర్షిప్ పొందడానికి ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి మీరు మరింతగా మీ ప్రతిభను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఏది ఏమైనా ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న ఈ స్కాలర్షిప్ పథకం ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థినిలకు ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: