నాచురల్ స్టార్ నాని కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలన్ని ఒకటి రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన వారో.. లేక కొత్తగా డైరక్షన్ చేపట్టిన వారో ఉన్నారు. శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ చేస్తున్న నానిసినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. టక్ జగదీష్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాని మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్టు టాక్. రీసెంట్ గా కలర్ ఫోటో అంటూ వచ్చి హిట్ అందుకున్న డైరక్టర్ సందీప్ రాజ్ కు నాని ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. చాయ్ బిస్కెట్ వీడియోస్ తో అలరించిన సందీప్ రాజ్ ఇప్పుడు డైర్కటర్ గా తన మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టాడు. కలర్ ఫోటో సినిమాలో సుహాస్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో నటించారు. సినిమాలో సునీల్ విలన్ గా నటించడం విశేషం.

ఆహాలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సింపుల్ కథతో ప్రేక్షకులను మెప్పించిన సందీప్ రాజ్ కు మంచి కథ ఉంటే తీసుకురా అని చెప్పాడట నాని. సో సందీప్ నెక్స్ట్ సినిమా నానితో అని ఫిక్స్ అవ్వొచ్చు. సుహాస్ కూడా హీరోగా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. నాని ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తి చేసుకుని త్వరలోనే సందీప్ రాజ్ తో సినిమా ఎనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.                                           

మరింత సమాచారం తెలుసుకోండి: