ఒకప్పుడు సినిమాల్లో నటించడం అంటే ఆమ్మో అని అందరు అనుకునేవాళ్లు. ఎవరికీ వారు వెండితెరపై తమ బొమ్మ చూసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే వెండితెరపై కనిపిస్తే వచ్చే క్రెజ్ వీరే. అలాగే అప్పట్లో సినిమాలో నటించేవారిని చూస్తుంటే వాళ్లు భలే అందంగా ఉన్నారే? వాళ్ళు ఎలా అందాలను కాపాడుకుంటారని, వయసు కూడా వారి దరి చేరదని అనుకునేవారు. అలాగే వాళ్ళు అభిమానించే హీరోలని చూడడానికి అప్పట్లో జనాలు ఎగబడి పోయేవారు. అయితే ఇప్పుడు   అవుట్ డోర్ పేరిట బయటకు రావడం, రియాలిటీ షోల పేరిట జనంతో కలసిపోవడంతో హీరోలను ప్రత్యేకంగా చూడాలని అనుకునే వారి సంఖ్య తగ్గింది. హీరోలు కూడా  తమలాంటి వారేనని డిసైడ్ అయ్యారు మామూలు జనం. అంతే కాదు స్మార్ట్ ఫోన్ల యుగంలో ఇపుడు ప్రతీ వారూ హీరోవే. షార్ట్ ఫిలిమ్స్ సైతం స్మార్ట్ ఫోన్ లో తీస్తూ తమ టాలెంట్ ని ఎవరికి వారు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే  ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అలా అడుగుపెట్టి.. ఇలా కనుమరుగవుతున్న హీరోలు, హీరోయిన్స్ చాలా మందిదనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో వెండి తెర హీరోలకు మునుపటి అంత క్రేజ్ లేదు, ఇవన్నీ ఒక్కసారి కనుక ఆలోచిస్తే కొందరు స్టార్లూ,  స్టార్ వారసులు తప్ప చాలా మంది హీరోలు ఒకటి రెండు సినిమాలకే మాయం అవుతున్నారు. అయితే ఇప్పటికి ఒక నలుగురు హీరోలు మాత్రం  తమ కెరీర్ ని అలా కంటిన్యూ చేస్తూ, ఆరు పదుల వయసులో కూడా తమ  పెర్ఫార్మెన్స్ తో మన టాలీవుడ్ ను ఏలుతున్నారు. ఆ హీరోల్లో మొదటగా  చెప్పుకోవాల్సింది  మెగాస్టార్ చిరంజీవి గురించి. ఇండస్ట్రీలో ఎవరి అండ లేకుండా అంచలంచెలుగా మెగా స్టార్ రేంజ్ కి చేరుకున్నారు.

 ఆయన 1978లో ప్రాణం ఖరీదు మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా గాని తరువాత బాస్ ఐస్ బ్యాక్ అంటూ మళ్ళీ తన సత్తా చాటారు. వయసుతో పని లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఆయన వయసు ఆరున్నర పదులు అంటే నమ్మబుద్ధి కాదు. ఇలాగే మరో అయిదేళ్ళ పాటు నటించే స్టామినా కూడా మెగాస్టార్ సొంతం. అలాగే ఎన్టీయార్ నట వారసుడిగా వచ్చిన మన బాలయ్య బాబు కూడా ఇప్పటికే  టాప్ రేంజి హీరోగా వెలుగుతున్నాడు. బాలయ్య కూడా ఆరు పదులు దాటిన హీరోవే. అలాగే మరొక సీనియర్ నటుడు, అక్కినేని వారి వారసుడు నాగార్జున .ఈయన కూడా అంతే. ఆరు పదుల వయసు దాటినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. సోగ్గాడుగా నవ మన్మధుడిగా వెండితెరను ఇప్పటికీ  పండిస్తున్నాడు. అలాగే యాంకరింగ్ కూడా చేస్తూ, యూత్ కి గట్టి పోటీని ఇస్తున్నాడు. అదే విధంగా విక్టరీ వెంకటేష్ కూడా ఆరు పదుల వయసులో పక్కా మాస్ అంటూ నారప్పతో అదిరిపోయే పెర్ఫారెమెన్స్ ఇస్తున్నాడు. మన టాలీవుడ్ హిస్టరీలో అలుపెరగని తారల లిస్ట్ లో ఈ  నలుగురు ముందు వరసలో ఉన్నారు.వయసుతో పని లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు.  ఆరు పదుల వయసు దాటినా అలసట లేని హీరోలుగా వీరిని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: