అల్లరి నరేష్ ,కార్తిక నాయర్ ,కొన్ని కామెడీ సన్నివేశాలు ,నేపధ్య సంగీతం అల్లరి నరేష్ ,కార్తిక నాయర్ ,కొన్ని కామెడీ సన్నివేశాలు ,నేపధ్య సంగీతం ఊహించదగ్గ కథనం ,దర్శకత్వం ,కథనం ,పాటలు ,చిత్ర నిడివి

రామ కృష్ణ (అల్లరి నరేష్) మరియు లక్ష్మి (కార్తిక నాయర్) ఇద్దరు కవలలు, ఒకరు ఎలా ప్రవర్తిస్తే ఇంకొకరు దానికి సరిగ్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. లక్ష్మి అందరితో గొడవలకు వెళ్తూ ఉంటుంది దానికి ఫలితం మాత్రం రామకృష్ణ ఎదురుకోవాల్సి వస్తుంది. ఇలా నడుస్తుండగా రామకృష్ణ , శృతి(మోనాల్ గజ్జర్) ని ప్రేమిస్తాడు. లక్ష్మి సహాయంతో రామకృష్ణ శ్రుతిని ప్రేమలో పడేస్తాడు.. లక్ష్మి ప్రవర్తనతో చిరాకెత్తిన తల్లి తండ్రులు రామ కృష్ణ ముందు తన చెల్లెలి పెళ్లి చెయ్యాలని చెప్తారు.. అక్కడ నుండి రామకృష్ణ లక్ష్మి కి వరుడిని ఎలా వెతికాడు అన్నదే కథ...

ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు బాగా నటించారు , చిత్రం మొత్తం ప్రధాన పాత్రల మీదనే ఆధారపడి ఉంటుంది ఆ రెండు పాత్రలు పోషించిన అల్లరి నరేష్ మరియు కార్తిక నాయర్ ఈ పాత్రలకు తగ్గ న్యాయం చేసారు. అల్లరి నరేష్ ఎప్పటిలానే తన టైమింగ్ తో ఆకట్టుకోనగా కార్తిక నాయర్ తన నటనలో మరో కోణాన్ని చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.. ఆమె కామెడీ టైమింగ్ చాలా బాగుంది . టైమింగ్ విషయంలో అల్లరి నరేష్ తో పోటీపడింది.. మోనాల్ గజ్జర్ పాత్రకి తగ్గ న్యాయం చేసింది .హర్షవర్ధన్ రాణే చూడటానికి బాగున్నారు పాత్రకి తగ్గ నటన కనబరిచారు. భానుశ్రీ మెహ్రా మరియు అభిమన్యు సింగ్ పర్లేధనిపించారు.. బ్రహ్మానందం అతని పాత్రకి పరిమితం అయ్యారు.. వెన్నెల కిషోర్ , అలీ , శ్రీనివాస్ రెడ్డి వారి పాత్రలకు తగ్గ ప్రదర్శన కనబరిచారు..

కథ పరంగా ఈ చిత్రం ఆకట్టుకోలేదు, చిత్రాన్ని మొత్తం కథనం మరియు కామెడీ మీద నేట్టేసాడు దర్శకుడు ఆ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. మొదటి అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగానే పేలినా రెండవ అర్ధ భాగం వచ్చేసరికి కమేడ్డి కూడా వర్క్ అవుట్ అవ్వలేదు చిన్ని కృష్ణ చాలా సన్నివేశాలను ఆసక్తికరంగా రచించుకున్నా కూడా వాటిని తెర మీదకు అంతే ఆసక్తికరంగా తీసుకురాలేకపోయాడు.. చిత్రంలో ప్రతి సన్నివేశం గతంలో ఏదో ఒక చిత్రంలోని సన్నివేశం అయ్యి ఉంటది "దేవుడు చేసిన మనుషులు" ,"ఆర్య 2", "మన్మధుడు" , "గోల్ మాల్" , "నువ్వు నాకు నచ్చావ్" ," కందిరీగ" , "జయీభవ" మొదలగున చిత్రాలను ఈ చిత్రంలో గమనించవచ్చు .

సినిమాటోగ్రఫీ అందించిన విజయ్ కుమార్ ఆకట్టుకోలేకపోయారు మంచి మంచి లోకేషన్స్ ఉన్న కూడా అందంగా చూపించలేకపోయాడు సినిమాటోగ్రాఫర్. శేకర్ చంద్ర అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేదు కాని నేపధ్య సంగీతం కామెడీ టైమింగ్ తగ్గట్టుగా సహాయపడింది.. ఎడిటింగ్ అందించిన గౌతం రాజు ఈ చిత్రాన్ని మరొక ఇరవై నిముషాలు సులువుగా కత్తిరించవచ్చు అవన్నీ అయన కత్తెర నుండి తప్పించుకు వచ్చాయి. మాటలు కొన్న్ని సన్నివేశాలలో బాగున్నాయి. సిరి సినిమా వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఈ చిత్రం బాగానే మొదలవుతుంది కాని సాగే కొద్ది చిరాకు పెట్టేస్తుంది , ఈ చిత్రం మొదటి అర్ధ భాగం కామెడీ గా సాగుతుంది.. కాని రెండవ అర్ధ భాగం లో బాగా నెమ్మదిగా సాగుతుంది అంతే కాకుండా గతంలో మనం చూసేసిన చిత్రాలను తిరిగి మళ్ళీ చూపించాలన్న ప్రయత్నం దర్శకుడికి కొన్ని చోట్ల సహాయపడింది కాని చాలా చోట్ల చిరాకు పుట్టించింది. ఒకవేళ మీరు కథ కథనం వంటివి పట్టించుకోకుండా చిత్రాన్ని చూసే వారయితే , అల్లరి నరేష్ కి వీరాభిమానులు అయితే మీకోసమే ఈ చిత్రం ..Allari Naresh,Karthika Nair,Monal Gajjar,B Chinni Krishna,Ammiraju Kanumilli,Sekhar Chandra.బ్రదర్ అఫ్ బొమ్మాలి : నరేష్ కోసమే చూడాలి ...

మరింత సమాచారం తెలుసుకోండి: