మన టాలీవుడ్ లో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. వీరంతా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే. డైరెక్టర్ కావడం అంటే అంత సులువైన విషయం ఏమి కాదు, తన సినిమాని ఎంతో కష్టపడి తీర్చిదిద్దితే గాని, ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కష్టపడే తత్వం కలవారిలో తెలుగులో  చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే మనకు తెలిసిన కొందరు దర్శకులు, వారి ఉన్నత చదువులు ఏంటో ఒక సారి తెలుసుకుందాం.

1). త్రివిక్రమ్:తన సినిమాల్లో ఎక్కువగా డైలాగులతోనే ఆకట్టుకునే దర్శకుడు త్రివిక్రమ్.ఈయన MSC (AU) "న్యూక్లియర్ ఫిజిక్స్ లో  GOLD MEDALIST, అంతేకాకుండా ఈయన సైన్స్ టీచర్ గా కూడా పనిచేశారు.

2). శ్రీనివాస్ అవసరాల:సాఫీగా సాగిపోయే కథతో తీసే డైరెక్టర్ లలో  ఈయన కూడా ఒకరు. ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

3). శేఖర్ కమ్ముల:తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ గా పేరు పొందాడు. ఈయన CBIT  నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, న్యూజెర్సీ హోవర్డ్ యూనివర్సిటీ నుంచి MFA పూర్తి చేశాడు.

4). శ్రీకాంత్ అడ్డాల:భిన్నమైన కథలతో మంచి గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేశాడు.

5). దేవా కట్టా:కొంచెం క్రియేటివిటీ ను క్రియేట్  చేసే డైరెక్టర్లలో దేవాకట్టా కూడా ఒకరు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు.

6). సుకుమార్:స్టార్ హీరోలకు ఇమేజ్ ను సాధించిపెట్టే చిత్రాలు తీయడంలో సుకుమార్ కి  ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఈయన మ్యాథ్స్ లో  డిగ్రీ పట్టా అందుకుని,  కాకినాడలో ఆదిత్య జూనియర్ కళాశాలలో సైన్స్ అలాగే మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేశారు.

7). రవిబాబు:ఈయన  తీసే సినిమాలలో సస్పెన్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పూణే లోని సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

8). ఇంద్రగంటి మోహన కృష్ణ:ఈయన లయోలా కాలేజ్ నుంచి డిగ్రీ పట్టాను అందుకని ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫిలోసఫీ అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: