ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడిందని తెలుస్తుంది.

అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయని సమాచారం. వారిలో అనీ మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ అలాగే ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే ఎపిసోడ్ లో మాస్ట్రో సినిమా టీమ్ సందడి చేయనున్నట్లు తాజాగా వార్త వినిపిస్తుంది..ఈ మేరకు బిగ్ బాస్ స్టేజ్ పై తమన్నా మరియు నితిన్ అలాగే నభా నటేష్ ఇంటి సభ్యులను పలకరించనున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని సమాచారం. వీరితో పాటుగా రామ్ చరణ్ కూడా ఈ షో లో పాల్గొంటున్నట్లు సమాచారం.

ఇక ఈ బిగ్ బాస్ షో అయిపోగానే మినీ బిగ్ బాస్ షో లో ప్రవేశ పెడతారని తెలుస్తుంది. ఇది కేవలం 50 రోజులు మాత్రమే కొనసాగుతుందని సమాచారం.అది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం చేస్తారని సమాచారం అందింది. ఇక ఈ షో కోసం ఎక్కువగా సోషల్ మీడియా స్టార్లు అలాగే టీవీ యాంకర్ లను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నట్లు సమాచారం.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ వచ్చే ఏడాది ఆరో సీజన్ లో పాటిస్పేట్ చేసే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇక ఇటీవల రామ్ చరణ్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన సంగతి అందరికి తెలిసిందే. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ నేటి షో కు వచ్చి ఉంటాడని అందరూ అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందేనని తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: