ఇటీవల కాలంలో ప్రేక్షకులకు ముఖ్యంగా యువతను బాగా ఆకర్షించే సినిమాలు ఎన్నో వచ్చాయి. తాజాగా మరో చిత్రం యూత్ ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అదే రౌడీ బాయ్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ యువ కథానాయకుడు హీరోగా పరిచయం కాబోతు ఉండగా ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ గత యూత్ ను ఆకర్షించిన సినిమాలను గుర్తు చేశాయి. గతంలో కూడా యువతను ఆకర్షించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమాలు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ లు గా మిగిలాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ తర్వాత సూపర్ హిట్ ను అందుకాగా హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచి ఆయా నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇవి కాలేజీ నేపథ్యంలో యూత్ని ఎక్కువగా ఆకర్షించే సినిమాలుగా తెరకెక్కగా తాజాగా అదే నేపథ్యంలో రౌడీ బాయ్స్ అనే సినిమా తెరకెక్కించి కాలేజీ స్టూడెంట్స్ ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. 

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది తప్పకుండా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని చిత్రబృందం భావిస్తుండగా ఈ చిత్రంలో అన్ని రకాల ఎలిమెంట్స్ యూత్ కు నచ్చే విధంగా సమపాళ్ళలో ఉన్నాయని కూడా తెలుపుతుంది. ఏదేమైనా ఇలాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో దిల్ రాజు కరెక్ట్ టైంలో ఈ సినిమా ను విడుదల చేయడం ఇది యూత్ కి పండగ లాంట సినిమా అనే చెప్పవచ్చు. కాలేజీ నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండగా ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది బృందం చెబుతోంది. ఇకపోతే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్ లు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచింది ఈ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: