సాధారణంగా ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. ఆ సినిమాకి పోటీగా మరికొన్ని సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కాని వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి మిగిలిన సినిమాలు తెలియకుండానే థియేటర్ల నుండి కనిపించకుండా పోతాయి. కానీ అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం చాలా గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పుడు కేవలం ఒకటి,రెండు సినిమాలు మాత్రమే విడుదల చేస్తూ ఉంటారు మన సినీ హీరోలు.

ఇలా ఎన్నో సందర్భాలలో పలు సినిమాలు ఇలానే విడుదలయ్యాయి.. అలాంటి వాటిలో రాజా సినిమా కూడా ఒకటి.ఈ సినిమాకి డైరెక్టర్ ముప్పలనేని శివ తీశాడు.ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ నటించగా, హీరోయిన్ గా సౌందర్య నటించింది. ఈ సినిమా 1999 వ సంవత్సరం మార్చి 18న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.

 ఈ సినిమాలో సౌందర్య వెంకటేష్ పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం హైలెట్ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా విడుదలై మొదటి వారంలోనే దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసి రికార్డు సృష్టించింది. అయితే రాజా చిత్రం విడుదల సమయంలో కొన్ని సినిమాలు ఈ సినిమాకి పోటీగా వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజేంద్రప్రసాద్ హీరోగా, ఇంద్రజ హీరోయిన్లు కలిసి నటించిన చిత్రం చిన్ని చిన్ని ఆశ..ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక హీరో శ్రీకాంత్, రమ్య కృష్ణ తో నటించిన సినిమా "ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు"ఈ సినిమా కూడా పర్వాలేదనిపించింది.జెడి చక్రవర్తి, రాశి కలిసి నటించిన చిత్రం హరిచంద్ర.. ఈ సినిమా కూడా ఫ్లాప్ ను చవి చూసింది.అలాగే మోహన్ బాబు యమజాతకుడు ఇలా ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ కేవలం రాజా సినిమా ఒకటే కాకుండా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం దేవి సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: