మెగాస్టార్ సినిమా అంటేనే అదో ఊపు. ఆయన పేరు తలిస్తేనే అదొక పాజిటివ్ వైబ్రేషన్. అలాంటి మెగాస్టార్ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయి రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ కి ఎంతటి ఉత్సాహమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే ఆచార్య మూవీ మెగాస్టార్ చేశారు. ఈ మూవీలో ఉన్న విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీలో తన కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో  కలసి నటిస్తున్నారు. ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీయే డిఫరెంట్ యాంగిల్ లో ఉంటుంది. ఇక రిలీజ్ అయిన టీజర్ కూడా దుమ్ము రేపింది. ఈ సినిమా ఈ దసరాకు వస్తుంది అనుకున్నారు. కానీ టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇంకా తేలకపోవడం వల్ల ఆగింది. దాంతో డిసెంబర్ కి రిలీజ్ అవుతుంది అనుకున్నారు.

కానీ ఇపుడు చూడబోతే ఈ మూవీ ఏకంగా ఫిబ్రవరి 4 కి వాయిదా వేశారు. ఆ రోజున రిలీజ్ అని లేటెస్ట్ గా ఒక కీలకమైన  ప్రకటన వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా తెగ ఫీల్ అవుతున్నారు. ఏకంగా మరో నాలుగు నెలల పాటు ఈ మూవీని వాయిదా వేయడమేంటని వారు ఆవేదన చెందుతున్నారు. డిసెంబర్ కి క్రిస్మస్ కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటే ఏకంగా ఫిబ్రవరి లో ఏంటని ఫ్యాన్స్ బాధ పడుతున్నారుట. ఈ మధ్యలో చాలా సీజన్లు మిస్ అయిపోతున్నాయని కూడా వారు అంటున్నారుట. మొత్తానికి ఆచార్య మాత్రం ఏకంగా నాలుగు నెలల చివరికి వాయిదా వేసుకోవడం పట్ల ఫ్యాన్స్ అయితే చాలా డిస్ అపయింట్మెంట్ అవుతున్నారు. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటిది మూవీ వాయిదా పడడం అంటే ఫ్యాన్స్ కి నిజంగా బాధే కదా.








మరింత సమాచారం తెలుసుకోండి: