బొమ్మ‌రిల్లు, ప‌రుగు మంచి సినిమాలు. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి చూడాల్సిన సినిమాలు. ఆరేంజ్ కూడా ఆ త‌ర‌హానే కానీ జ‌నం ప‌ట్టించుకోలేదు. ఈ సారి కూడా త‌ల్లిదండ్రుల‌కు కొన్ని విష‌యాలు చెబుతూనే, కుర్ర‌కారునూ దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ రాశాడు భాస్క‌ర్. సున్నిత భావోద్వేగాల‌ను మిళితం చేస్తూ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2తో క‌లిసి మ‌రో ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ నిర్మించాడు. ఇప్ప‌టిదాకా కెరియ‌ర్ లో చేసిన సినిమాలేవీ పెద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు. అలా అని అఖిల్ మంచి న‌టుడు అని కూడా చెప్ప‌లేదు. నిరూపించ‌లేదు. ఈ సినిమా అయినా అఖిల్ కెరియ‌ర్ మారుస్తుంద‌న్న ధీమాతో అభిమానులు ఉన్నారు. వారి న‌మ్మ‌కాలు, విశ్వాసాలు ఏ విధంగా ఒడ్డెక్కుతా యో అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయకం.

 
ఎప్ప‌టి నుంచో ఓ మంచి సినిమా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ నుంచి వ‌స్తుంద‌ని ఆశిస్తున్న వారికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా ఓ కానుక కానుంద‌ని అక్కినేని అభిమా నులు ఆనందోత్సాహాలు వ్య‌క్తీక‌రిస్తున్నారు. తాత‌కు ద‌స‌రా సీజ‌న్ ఎలా క‌లిసివ‌చ్చిందో అదేవిధంగా అక్కినేని వారింటి న‌ట వార‌సుడు అయిన అఖిల్ కూ త‌ప్ప‌క మంచి ఫ‌లితాల‌నే అందిస్తుంద‌న్న ఆశాభావం ఒక‌టి వెల్ల‌డి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో పూజా హెగ్డేనే హైలెట్ అని అంటున్నారు. అఖిల్ త‌న పాత్ర‌కు త‌గ్గ న‌ట‌న‌తో అల‌రించి త‌న క‌న్నా సీనియ‌ర్ అయిన పూజ‌ను మ్యాచ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని ఇంకొంద‌రు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే....
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల‌యి థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ముఖ్యంగా సినిమాలో అఖిల్, పూజా బేబీ మ‌ధ్య న‌డిచే రొమాన్స్ బాగుంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఇంకొంద‌రు త‌మ పోస్టులలో చాలా రోజుల‌కు ఓ మంచి సినిమా వ‌చ్చింద‌ని, సెన్సిబుల్  డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మంచి విజ‌యం అందుకున్నాడ‌ని ప‌లువు రు ప్ర‌శంసిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయ‌ని అంటున్నారు. కాగా ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ స్వ‌రా లు అందించారు. పాట‌లు ఇప్ప‌టికే మంచి పేరు తెచ్చుకున్నాయి. సిధ్ శ్రీ‌రామ్ పాడిన లెహ‌రాయి పాటకు మంచి స్పంద‌నే ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఎప్ప‌టి నుంచో మంచి విజ‌యం కోసం క‌ళ్లింత‌లు చేసుకుని ఎదురుచూస్తున్న అక్కినేని చిన్నోడికి ఈ పండుగ ఆ నందాల‌నే నింపింద‌ని  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: