నందమూరి బాలక్రిష్ణ చేయని పాత్ర లేదు, వేయని జోనర్ లేదు. ఆయన వందకు పైగా సినిమాలు చేశారు. మరి వేటికవే ప్రత్యేకంగా ఎన్నో పాత్రలు ఉంటాయి. బాలయ్యలోని నటుడిని తెచ్చే పాత్రలు కూడా చాలానే ఉన్నాయి.


అలాంటి బాలయ్య ఇపుడు కొత్త పాత్రలో నటిస్తున్నట్లుగా చెప్పుకున్నారు. తాను జానపద, పౌరాణిక, చారిత్రాత్మక,సాంఘిక చిత్రాలలో నటించాను కానీ ఇప్పటిదాకా వేయని పాత్ర ఇది అన్నారు. అదే ఆహా డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద ఆయన పోషించబోయే హోస్ట్ పాత్ర. అన్ స్టాబబుల్ అంటూ బాలయ్య ఆహాకు టాక్ షో చేస్తున్న సంగతి విధితమే. ఈ టాక్ లో పది నుంచి పన్నెండు ఎపిసోడ్స్ ఉంటుంది.


ఆయన ఈ టాక్ షో సందర్భంగా ఏకంగా డజన్ మంది దాకా సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే చాన్స్ ఉంటుంది. వారిని కంఫర్ట్ జోన్ లో ఉంచి ప్రశ్నలు రాబడతాను అని బాలయ్య అంటున్నారు. ఇక తన జీవితం తెరచిన పుస్తకమని చెప్పిన బాలయ్య ఇతరుల జీవితపు లోతుల్లో వారి భావోద్వేగాలు, వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు రాబట్టే ప్రయత్నమే తాను చేయబోతున్నట్లుగా చెప్పారు.


మొత్తానికి ఇది బాలయ్యకు కొత్త పాత్ర. ఆయనకే కాదు చూసేవారికి కూడా కొత్తగానే ఉంటుంది. ఇంతదాకా పెద్ద తెర మీద రాణించిన బాలయ్య ఏ రోజూ చిన్న తెర మీదకు రాలేదు. ఈ విషయంలో చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీయార్, నాని లాంటి వారు హోస్టులుగా బాగా చేశారు. ఇపుడు బాలయ్య వంతు వచ్చింది అంటున్నారు. బాలయ్య కనుక ఈ విషయంలో ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఆయన బుల్లి తెర మీద కూడా పక్కా మాస్ హీరో గా దూసుకురావడం ఖాయం. అన్ స్టాబబుల్ ప్రోమోస్ చూస్తూంటే బాలయ్య దుమ్ము దులపడం ఖాయమనే భావన వ్యక్తం అవుతోంది. ఫ్యాన్స్ కూడా కోటి ఆశలు పెట్టుకున్నారు. మా బాలయ్య సూపర్ హిట్టూ అంటున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: