మా అనేది రాజకీయ వేదిక కాదు...కళాకారుల వేదిక అన్నారు మంచు మోహన్ బాబు. నేడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి హాజరైన మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మనం రాజకీయాలకు దూరంగా ఉండాలి అని సూచించారు. అందరం ఒకే తల్లి బిడ్డలము అని ఆయన పేర్కొన్నారు. సీనియర్స్ కి నేను ఈరోజుకి గౌరవం ఇస్తాను అని మోహన్ బాబు కామెంట్స్ చేసారు. మనం పెద్దలను గౌరవించాలి అన్నారు ఆయన. మనిషిలో టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయి అని ఆయన వెల్లడించారు.

47 సంవత్సరాల నా నట జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అని ఆయన చెప్పుకొచ్చారు. మా లో రాజకీయాలు ఇలాగ కూడా ఉంటాయా అని ఆశ్చర్యం వేసింది అని తెలిపారు. ఇక్కడ పేరు, గొప్పలు ముఖ్యం కాదు అని అన్నారు మోహన్ బాబు. విజయాలు, అపజయాలు సినిమా ఇండస్ట్రీలో కామన్ అని మా ఎన్నికల సమయంలో మేము బలంగా ఉన్నామని  చాలా మంది బెదిరించారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒకరి దయ, దక్షిణ్యం సినిమా ఇండస్ట్రీలో ఉండవు...కేవలం టాలెంట్ ఉండాలి అంటూ పేర్కొన్నారు.

ఈరోజు విష్ణు ను గెలించినందుకు కృతజ్ఞతలు చెప్పారు ఆయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా కోపం నాకే నష్టం కలిగించింది...ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పుబడతారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మంచి మనుషులు, మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించారు అని ఆయన అన్నారు. ఓట్ వేయని వారి మీద కక్ష వద్దు..నాకు రాగద్వేషాలు లేవు అని అన్నారు ఆయన. నా బిడ్డను మీ చేతిలో పెడుతున్న...మంచి హీరో, మంచి నటుడు అని భారత దేశంలోనే గొప్ప పేరు తీసుకువచ్చే విదంగా విష్ణు పని చేయాలి అని ఆయన కోరారు. విష్ణు విజయానికి నరేష్ కీలకంగా వ్యవహరించాడు అని కొనియాడారు. షూటింగ్ లు క్యాన్సల్ చేసుకొని మరీ విష్ణు గెలుపుకు సహకరించాడు అని అన్నారు ఆయన. హాట్స్ అప్ టూ నరేష్...నిన్ను ఎప్పుడు మర్చిపోలేను అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: