లక్ కలసిరావాలే కానీ మిగిలినవి ఏవీ పెద్దగా ప్రాముఖ్యతను పొందలేవు. చాలా మంది విజయమే ముందుకు తీసుకువెళ్తుంది అనుకుంటారు. కానీ లక్ ఉంటే ఏమైనా జరగవచ్చు. ఇవన్నీ ఎందుకంటే టాలీవుడ్ కి ఇద్దరు కొత్త వారు తాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

కె రాఘవేంద్రరావు సృష్టి పెళ్ళి సందడి మూవీ ద్వారా సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, అలాగే హీరోయిన్ గా శ్రీలీల టాలీవుడ్ లో మంచి పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రోషన్ విషయానికి వస్తే నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ఇప్పటికే పరిచయం అయినా హీరోగా ఇదే అసలైన  ఎంట్రీ అనుకోవాలి. పైగా వయసుకు తగిన పాత్ర కావడంతో పెళ్ళి సందడి మూవీలో రెచ్చిపోయాడు. స్టెప్స్ అదరగొట్టాడు. మనిషి కూడా చాలా బాగున్నాడు. టాలీవుడ్ లో చాలా మంది అందగాళ్ళు ఉన్నా ఈ మధ్య కాలంలో మాత్రం హ్యాండ్ సమ్ హీరోలు తక్కువగా వస్తున్నారు. ఆ లోటు రోషన్ తీర్చాడు అని చెప్పాలి.

కుర్రోడు చూడముచ్చటగా ఉన్నాడు అని అంటున్నారు. రోషన్ లో కంప్లీట్ గా హీరో మెటీరియల్ ఉంది. కేవలం లవ్ స్టోరీలే కాకుండా యాక్షన్ మూవీస్ అయినా మాస్ రోల్స్ అయినా చేయగల సత్తా ఉందని కూడా చూస్తే అర్ధమవుతోంది. అయితే  లేతగా ఉన్నాడు కాబట్టి ఇపుడే అలాంటివి వద్దు, కొన్ని మంచి సినిమాలు, ఫ్యామిలీ మూవీస్, ప్రేమ కధలు రోషన్ ద్వారా టాలీవుడ్ కి కావాలి. ఇక శ్రీలీల గ్లామర్ డాల్ అనుకోనక్కరలేదు, ఆమె నటన కూడా బాగుంది. తాను సూపర్ అని అంతా అంటున్నారు. పెళ్ళి సందడిలో ఈ అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలా  కనుక చూసుకుంటే శ్రీలీల కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యేలాగానే ఉంది. మొత్తానికి రాఘవేంద్రుడి పెళ్ళి సందడి ఊరకే పోదు అన్న మాట వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: