మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం అడవుల్లో థ్రిల్లింగ్‌ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజసినిమా తో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పాట లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.  ఇప్పటికే ప్రమోషన్లు జోరు పెంచిన ఖిలాడి చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇలా ఈ రెండు సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూన్న రవితేజ వీటితో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: