మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం వరకు డిస్కో రాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి వరస ఫ్లాప్ లతో డీలా పడిపోయాడు. అలాంటి సమయంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇలా క్రాక్ సినిమాకు ముందు వరకు పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయిన మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అదే జోష్ లో వరుస సినిమాలలో నటిస్తూ తన హవాను కొనసాగిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా షూటింగ్ ను కూడా శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

 ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ రెమ్యునరేషన్ గురించి వార్తలు విన్న కొంత మంది క్రాక్ సినిమా విజయంతో రవితేజ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: