అందాల ముద్దు గుమ్మ అనసూయ బుల్లి తెర తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. జబర్దస్త్ షో తో ఎంతో మంది బుల్లి తెర అభిమానులను సంపాదించుకున్న అనసూయ, ఆ తర్వాత కాలంలో అనేక టీవీ షో లో నటించి మెప్పించింది. టీవీ షోల ద్వారా జనాల నుండి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా లో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇలా అతి తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించిన అనసూయ వెండి తెర ద్వారా కూడా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇలా మొదటి సినిమా తోనే ఎంతో మంది ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకున్న అనసూయ ఆ తర్వాత కాలంలో కూడా అనేక సినిమాలలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. కేవలం ప్రత్యేక పాత్రలో మాత్రమే కాకుండా చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించిన అనసూయ కొన్ని సినిమాలలో ప్రతినాయక పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇలా ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో ఎంత మంది ప్రేక్షకులను అలరించిన అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ జనాలతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజా గా కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన అనసూయ ను ఒక నెటిజన్ మీరు ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ నా అని అడగగా, అనసూయ ఆ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిస్తూ..  సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గుండు కొట్టించుకోవడానికైనా రెడీ అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఇలా అనసూయ సినిమా లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గుండు కొట్టించుకోవడానికైనా రెడీ అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అనసూయ కు సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ మరియు చిత్తశుద్ధిని చాలా మంది ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: