టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తన సినిమాల్లో హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు గురూజీ. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఓ మీడియం రేంజ్ హీరోయిన్ పేరుని పరిశీలించడం ఆశ్చర్యకరంగా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమాగా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు ఈ సినిమాలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే ని కన్ఫామ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కథానాయికగా నభానటేష్ ను ఎంపిక చేసినట్లుగా గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. కానీ ఇప్పుడేమో నభానటేష్ కాదు లావణ్య త్రిపాటి ని మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ మొదలైంది. సెకండాఫ్ మొత్తం కథలో ట్రావెల్ అయ్యే ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ లావణ్య త్రిపాటి ని ఎంపిక చేసుకోవడంతో ఈ న్యూ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 ఇక మహేష్ బాబు తో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడం.. మరోవైపు అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి భారీ హిట్స్ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కు జోడిగా రెండో హీరోయిన్గా లావణ్య త్రిపాటి ని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ నుంచి వీరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: