రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ 'ఆర్ ఆర్ ఆర్'. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రల స్ఫూర్తితో వస్తోన్న ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ ఉంది. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తోన్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుంచి ఇటీవల 'నాటు నాటు' సాంగ్‌ రిలీజైంది. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీలో తారక్, చరణ్‌ చేసిన డాన్సులకి క్రేజీ కామెంట్స్‌ వస్తున్నాయి. కొంతమంది డాన్స్‌ అదరగొట్టారు అని ప్రశంసిస్తోంటే, మరికొంతమంది ఈ స్టెప్పులు కాపీ అని విమర్శిస్తున్నారు. ఆఫ్రికన్‌ సాంగ్‌ డాన్సింగ్‌ కుంబాయా స్టెప్పులని దింపారని కామెంట్ చేస్తున్నారు.

రాజమౌళిని పాన్‌ ఇండియన్‌ డైరెక్టర్‌గా నిలబెట్టిన 'బాహుబలి'పైనా కాపీ క్యాట్‌ విమర్శలు వచ్చాయి. 'బాహుబలి2' ఏనుగు పోస్టర్‌ని థాయ్‌ఫిల్మ్ ఓఎన్‌జి బ్యాక్2:ది బిగినింగ్‌ నుంచి కాపీ చేశారనే విమర్శలొచ్చాయి. అలాగే 'బాహుబలి1'లో రానా కత్తుల రధంని హాలీవుడ్‌ ఫిల్మ్‌ 'హెర్కులస్' నుంచి కాపీ చేశారనే కామెంట్స్‌ వచ్చాయి.

రాజమౌళి ఆడియన్స్‌ని ఎంగేజ్‌చెయ్యడంలో ఎక్స్‌పర్ట్. ఎలాంటి కథ తీసుకున్నా ఆడిటోరియం ఆశ్చర్యపోయేలా స్క్రీన్‌ప్లేతో మాయ చేస్తాడు. ప్రేక్షకులని ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్తాడు. అందుకే కాపీ క్యాట్‌ అని విమర్శలు వచ్చినా.. రాజమౌళి సినిమాలపై బజ్‌ పెరుగుతూనే ఉంది. రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మసాలా మూవీ 'విక్రమార్కుడు'. ఈ సినిమాలో రవితేజ బెల్ట్‌తో విలన్‌ కొడుకుని చంపే సీన్‌పైనా విమర్శలొచ్చాయి. విజయశాంతి 'శాంభవి ఐపియస్' సినిమా నుంచి ఈ సీన్‌ని కాపీ చేశారనే కామెంట్స్ వినిపించాయి.

'మర్యాదరామన్న' సినిమాపైనా కాపీ క్యాట్‌ కామెంట్స్ వచ్చాయి. హాలీవుడ్‌ క్లాసిక్ 'అవర్‌ హాస్పిటాలిటీ' నుంచి ఈ సినిమాని కాపీ చేశారనే విమర్శలొచ్చాయి. అలాగే 'మగధీర' సినిమాలో షేర్‌ఖాన్‌ గ్యాంగ్‌తో పైట్‌ సీన్‌లో బాణాలు దూసుకొచ్చే సీన్స్‌ని '300' ఫిల్మ్‌ నుంచి కాపీ చేశారనే కామెంట్స్‌ వినిపించాయి. రాజమౌళి గ్రాఫికల్‌ వండర్‌ 'ఈగ' సినిమా స్టోరీని, ఆస్ట్రేలియన్ షార్ట్‌ ఫిల్మ్ 'కాక్రోచ్' నుంచి కాపీ చేశారనే విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: