కరోనా కారణంగా ఆలస్యంగా మొదలయ్యింది బిగ్ బాస్ సీజన్ ఫైవ్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందంటే ప్రేక్షకులు సంబరాలు జరుపుకున్నారు. అసలు షో నిన్న మొన్న మొదలయ్యింది అన్నటుగా ఉంది కానీ షో మాత్రం చివరి దశకు చేరుకుంది. ఇక మొదట పందొమ్మిది ఇంటి సభ్యులతో మొదలయిన ఈ జర్నీలో ఇపుడు కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఎలిమినేట్ అయిన వారిలో హమీద, శ్వేతా వర్మ, లహరి, అని మాస్టర్ లు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. కాగా ఇపుడు ఓ క్రేజీ వెబ్ సిరీస్ ఆఫర్ వీరి చెంతకు చేరినట్లు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ ను డిజైన్ చేసినట్లు సమాచారం.

కానీ ఈ వెబ్ సిరీస్ పై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.  ఇందులో శ్వేతా వర్మ పోలీస్ రోల్ చేయబోతున్నారని హమీద, లహరి, సరయు లు ముఖ్య భూమిక లు పోషిస్తుండగా అనీ మాస్టర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మొదట ఈ వెబ్ సిరీస్ కు హమిదను మాత్రమే సెలెక్ట్ చేయగా...ఆ తరవాత అంతా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి ఎలిమినేట్ అయిన అనీ మాస్టర్, శ్వేతా వర్మ, లహరి, సరయు లు ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావించి వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం.

వీరైతే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవుతుందని భావిస్తున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అయ్యే లోపు ...ఒకవేళ సిరి కనుక హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తే ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ తనకే దక్కుతుందని చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఫుల్ డీటైల్స్ ఏమిటి...ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: