ఇక
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ అనే
సినిమా రాగా అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో
సినిమా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రాగా అది త్వరగా నెరవేరడంతో ఒక్కసారిగా అందరిలో సంతోషం నెలకొంది. దానికి తగ్గట్లుగానే
కొరటాల శివ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కంటే అదిరిపోయే విధంగా ఉండాలని చెప్పి ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడు. వాస్తవానికి
కొరటాల శివ తో
కొరటాల శివ సినిమా మొదలు పెట్టాల్సింది కానీ చివరి నిమిషంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి
ఎన్టీఆర్ తో సినిమ ను చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాను ఇంకా మొదలు పెట్టనే లేదు ఈ సమయంలోనే
ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పటికే
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే
సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలుపెట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న
సినిమా లకు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత
ఎన్టీఆర్ తో చేతులు కలపనున్నాడు. ఏదేమైనా
ఎన్టీఆర్ వచ్చే ఏడాది కూడా ఫుల్ బిజీగా ఉండడం ఆయన అభిమానులు ఎంతగానో సంతోషపెడుతుంది. భారీ చిత్రాలు చేస్తూ ఉండటం
ఎన్టీఆర్ కు బాగా కలిసివచ్చే అంశం.