హర్నాథ్ సందు.. ఈ పేరు ప్రస్తుతం  దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో సైతం ఈమె గురించి చర్చించుకుంటున్నారు. భారత ప్రజానీకం మాత్రం ఎంతగానో మురిసిపోతున్నారు. కారణం 20 ఏళ్లనిరీక్షణకు 21 ఏళ్ల యువతి తెరదించింది.. తనదైన అందం అభినయం తెలివితేటలతో 2021 మిస్ యూనివర్స్ టైటిల్  గెలుచుకుంది. దీంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆమె గురించే చర్చించుకుంటున్నారు. పంజాబ్కు చెందిన హర్నాథ్ సందు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకోవడం వరకు రావడానికి  ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురుకుంది.



 ఎన్నో అవమానాలు బాధలు ఎదుర్కొని ఇక విశ్వసుందరిగా మారిపోయింది ఈ 21 ఏళ్ల యువతి. మిస్ యూనివర్స్ పోటీల్లో తలపడిన 80 మంది అందగత్తెలను సైతం వెనక్కి నెట్టి తన ప్రతిభను చాటుకుంది. ఇజ్రాయిల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీలో ఇక ఈమె విశ్వసుందరిగా గెలుపొందడం గమనార్హం. అయితే హర్నాథ్ సందు స్కూల్ రోజుల్లో స్నేహితులు ఈమెని ఎంతగానో హేళన చేసే వారు. ఎలా ఉందో చూడండి.. గాలి వస్తే ఎగిరి పోతుంది.. అయ్యో పాపం అంటూ కామెంట్ లు చేస్తూ బాధ పెట్టే వారు. అయితే తనపై స్నేహితులు వేససే జోకులను మౌనంగానే భరిస్తూ తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది హర్నాథ్ సందు.



 అయితే చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఈమెకు ఎంతో ఆశ ఉండేది. ఈ క్రమంలోనే మోడలింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడింది. ఇలా ఓ వైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. 17 ఏళ్లకే మోడలింగ్లో అడుగుపెట్టిన ఈమె కాలేజీ లో స్టేజ్ ప్రదర్శనతో మోడలింగ్ ప్రారంభించింది. అంతేకాదు ఎన్నో ఫ్యాషన్ షో లలో పాల్గొంటూ వచ్చింది. 2017 లో మిస్ చండీగర్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమె 2019లో మిస్ పంజాబ్ కిరీటాన్ని సైతం సొంతం చేసుకుంది.. 2019 మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీపడి టాప్ 12   జాబితాలో నిలిచింది. ఇక ఇప్పుడు ఏకంగా మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక ఒకప్పుడు హర్నాథ్ సందు ని కామెంట్ చేసి నవ్వుకున్నవారు.. ఇక ఏకంగా ఆమె మిస్ యూనివర్స్ కావడంతో నోరెళ్లబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: