ముందు సినిమాల్లో హీరోయిన్ గా ప్రయత్నించగా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చేస్తూ వచ్చిన రష్మి గౌతం జబర్దస్త్ షోతో పాపులర్ అవగా ఆ క్రేజ్ తో గుంటూర్ టాకీస్ లాంటి సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. యాంకర్ గా దూసుకెళ్తున్న అమ్మడు సినిమాలతో కూడా అలరిస్తుంది. అయితే ఒకేరకమైన పాత్రలు వస్తుండటం వల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చిన రష్మి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో స్పెషల్ సాంగ్ కు సై అన్నదని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబోలో వస్తున్న మూవీ భోళా శంకర్ లో రష్మి స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్. సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేస్తుండగా తమన్నా చిరుకి జోడీ కడుతుంది. ఈ ఇద్దరే కాకుండా ఇప్పుడు రష్మి కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుందని తెలుస్తుంది. చిరు సినిమాలో రష్మి నిజంగా అమ్మడికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అయినా సరే ఆమె రెమ్యునరేషన్ విషయంలో భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

ఈ మెగా స్పెషల్ సాంగ్ కోసం రష్మి దాదాపు 70 లక్షల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని అంటున్నారు. చిరుతో సాంగ్ ఛాన్స్ రావడమే లక్కీ అనుకుంటే అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా కావాల్సిందే అంటుందట రష్మి. చూస్తుంటే రష్మి ఈ పాటతో నెక్స్ట్ లెవల్ ఇమేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ స్పెషల్ రోల్స్ తో ప్రత్యేకత చాటుకుంటుంది. ఇప్పుడు రష్మి కూడా అదే బాటలో సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అయ్యింది. మరి చిరుతో రష్మి స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. తప్పకుండా రష్మి కెరియర్ కు ఈ స్పెషల్ సాంగ్ మాత్రం చాలా హెల్ప్ ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. మెగాస్టార్ తో రష్మి ఛాన్స్ ఆమె కెరియర్ కి కొత్త ఉత్సాహం తెస్తుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: