తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. తాజాగా రెండు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో రీమేక్ సినిమాలతో సైతం సూపర్ హిట్లు సాధించి తెలుగులో రికార్డులను నెలకొల్పుతున్నాడు ఇప్పుడు మరొక స్ట్రయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ మరొక విజయాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. అయితే ప్రతి హీరో కొన్ని సందర్భాలలో కొన్ని హిట్ సినిమాలను వదులుకోక తప్పదు. అలా వెంకటేష్ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలను వదులుకున్నాడు. ఆ సినిమా లేంటో ఇప్పుడు చూద్దాం.

అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమా మొదటగా వెంకటేష్ వద్దకే వచ్చింది. అయితే అప్పుడు ఉన్న కొన్ని సమస్యల కారణంగా ఆయన ఈ సినిమా చేయలేదు. దాంతో ఈ చిత్రాన్ని శంకర్ అర్జున్ తో చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి సౌత్ సినిమా పరిశ్రమకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమా మొదట వెంకటేష్ చేయాల్సిందిగా క్రిష్ కోరగా ఈ సినిమా రానా అయితే బాగుండు అని చెప్పి ఆయనకు సిఫార్సు చేయగా ఈ సినిమా తన కెరీర్లో ఓ మంచి చిత్రంగా నిలిచిపోయింది. 

అలాగే దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సంతోషం సినిమా కూడా మొదట వెంకటేష్ దగ్గరికి రాగా ఆ తర్వాత నాగార్జున సినిమాలు చేయగా ఆయనకు సూపర్ హిట్ దక్కింది. రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే సినిమా లో శ్రీకాంత్ పాత్ర కు వెంకటేష్ కే రాగా ఆ పాత్ర తీరుతెన్నులు వెంకటేష్ కు నచ్చక చివరకు శ్రీకాంత్ కు  వెళ్ళింది. అలాగే రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం కూడా మొదటగా వెంకటేష్ వద్దకు వెళ్లగా అప్పుడు డేట్స్ సమస్య వల్ల ఆ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ అయ్యాడు వెంకటేష్. ఇప్పుడు ఇవన్నీ చిత్రాలు చేస్తే వెంకీ ఇమేజ్  మరింత పెరిగే దేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: