ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ' ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నా.. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు, గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఒకవైపు ఏపీలో టికెట్ రేట్ల సమస్య మరోవైపు కరోనా కొత్త వేరియంట్ థర్డ్ వేవ్ అంటూ ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా సినిమాని కచ్చితంగా అనుకున్న తేదీకే విడుదల చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా విడుదల చాలా ఆలస్యమైంది.

అందుకే ఈసారి మాత్రం వాయిదా వేసే అవకాశం లేదంటూ మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేస్తూ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పోలీస్ అధికారిగా, ఎన్టీఆర్ ఒక విప్లవకారుడిగా కనిపించబోతున్నారు. అయితే ఇదే సినిమాలో ఈ ఇద్దరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ గా కూడా కనిపించనున్నారు. 

ఆ లుక్స్ లో ఈ ఇద్దరు హీరోలు కనిపించినపుడు ప్రేక్షకులు లేచి మరి చప్పట్లు కొడతారు అని ఇప్పటికే రాజమౌళి చెప్పడం జరిగింది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా లో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ గెటప్స్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. అది కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో ని ఫైటింగ్ సన్నివేశంలో మాత్రమే ఆ గెటప్స్ తో కనిపిస్తారట. కేవలం యాక్షన్ సీన్స్ వరకే అది పరిమితం అవ్వనుందని అంటున్నారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా.. సినిమా మొత్తం ఎన్టీఆర్,చరణ్ లను రాజమౌళి ఏ విధంగా చూపెట్టనున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR