థియ‌రీ ఆఫ్ డైన‌మిక్స్
థియ‌రీ ఆఫ్ పొట‌న్షియాలిటీ
వీట‌న్నింటి గురించి
మాట్లాడితే బ‌న్నీ ఒక్కడే ఎదురువ‌స్తాడు



త‌న‌ని తాను మ‌లుచుకున్న విధానం ఒక‌టి గుర్తుకు వ‌స్తుంది. ఆర్య నుంచి పుష్ప వ‌ర‌కూ ఆయ‌న ఇచ్చిన స్టేట్మెంట్లు గుర్తుకువ‌స్తాయి. డిగ్రీ ఆఫ్ డీవియేష‌న్ గురించి నిన్న‌టి వేళ చెప్పాడు సుక్కూను ఉద్దేశించి! అదిరిపోయింది. అంతేకాదు ప‌వ‌న్ ను ఉద్దేశించి ఓ సంద‌ర్భంలో చెప్ప‌ను బ్రో అన్నాడు.. అక్కడ వివాదాల తుఫానే రేగింది.. ఆ ధూళిని ఆయ‌న ప‌ట్టించుకోడు. ప‌ట్టించుకున్నా వాటి తీవ్ర‌త‌ను దాటి ఆయ‌న ఆలోచించి  మ‌రో అడుగు వేయ‌గ‌ల‌డు. అందుకే ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్రో అన్నాడు.. తరువాత ఓ వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు. అయినా కూడా నెగ్గుకు వ‌చ్చాడు. ఇప్పుడు మెగామార్క్ వ‌ద్ద‌నుకుని, వ‌దులుకుని త‌నంత‌ట తాను రాణించేందుకు చేసే ఓ ప్ర‌య‌త్నం బ‌న్నీని మ‌రో స్థాయికి చేర్చ‌డం ఖాయం. అయితే ఆయ‌న త‌న మూలాలు మ‌రువ‌కుండా చిరు విష‌య‌మై, పవ‌న్ విష‌య‌మై కృత‌జ్ఞ‌త చూపితే ఆనందం.


హీరోల‌లో అల్లు అర్జున్ వేరు.. ఆయ‌న స్టైల్ వేరు.. ఆయ‌న ఒక ఐక‌న్.. ఆయ‌న మాట ఒక సైన్ అన్నంత‌గాపేరు తెచ్చుకుని ఇండ‌స్ట్రీని రెండేళ్లుగా వ‌రుస‌గా బంప‌ర్ హిట్ల‌తో నిలుపుతున్న వ్య‌క్తి ఆయ‌న. అల వైకుంఠ‌పురం త‌రువాత పుష్పతో త‌నదైన క్రేజ్ ను కొన‌సాగించి మంచి పేరు తెచ్చుకున్న హీరో ఆయ‌న. ముఖ్యంగా కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్.. అందుకే ఆయ‌న చాలా సార్లు హాట్ టాపిక్ కూడా అవుతున్నారు. ఈ ఏడాది ఆయ‌న మాట్లాడిన మాట‌లు, చేసిన ప్ర‌క‌ట‌న‌లు అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. బ‌హుశా! స‌క్సెస్ ఆ విధంగా మాట్లాడిస్తుందేమో!


ఇంకా చెప్పాలంటే....
ఈ ఏడాది సెల‌బ్ స్పీచ్ ల‌లో ఎక్కువ పేరు తెచ్చుకున్న‌ది బ‌న్నీ మాత్ర‌మే! ఎక్కువ వివాదాల‌తో పేరు తెచ్చుకున్నది కూడా బ‌న్నీ మాత్రమే! అంతేకాదు బ‌న్నీ ఏం చెప్పినా ట్రోల్ అయింది. బ‌న్నీ ఏం చెప్ప‌క పోయినా కూడా అదొక అటెన్ష‌న్ పాయింట్ గా డిజిట‌ల్ మీడియాలో నిలిచింది. ఆహాలో హ‌డావుడి చేసినా లేదా పుష్ప సినిమా ప్రీ రిలీజ్ లో త‌న కాన్ఫిడెన్స్ ను ఎస్టాబ్లిష్ చేసినా, అఖండ ప్రీ రిలీజ్ లో బాల‌య్య తో వేదిక పంచుకున్నా ఇవ‌న్నీ అదన‌పు ఆక‌ర్ష‌ణ‌లే! అయ్యాయి ఈ ఏడాదికి.


మరింత సమాచారం తెలుసుకోండి: