సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో హిట్టు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, అలా మహేష్ బాబు కెరియర్ లో ఉన్న మంచి సినిమాలలో  బిజినెస్ మాన్ సినిమా ఒకటి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 13 జనవరి 2012 న సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. బిజినెస్ మేన్ సినిమా కంటే ముందే మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో బిజినెస్ మెన్ సినిమా పై మొదటి  నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగిఉన్నాయి. అలా అలా మంచి అంచనాలతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సాధారణమైన వ్యక్తి గా ముంబైలో అడుగుపెట్టిన మహేష్ బాబు తన తెలివితేటలతో ఏ విధంగా ముంబై కి డాన్ గా మారాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హైలెట్ గా ఉంటాయి. అలాగే ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలతో తెరకెక్కి మంచి విజయం సాధించిన ఈ సినిమా 13 జనవరి 2022 వ తేదీకి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా బిజినెస్ మాన్ సినిమాను అమలాపురంలో స్పెషల్ షో వేయనున్నారు. అయితే ఈ స్పెషల్ షో ను 9 జనవరి 2022 న సాయంత్రం 6 గంటలకు శేఖర్ థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. ఇలా మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మహేష్ అభిమానులు ఈ సినిమా స్పెషల్ షో ను ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: