అక్కినేని నాగార్జున టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరో గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 90 చిత్రాలకు పైగా చేశాడు. తొందర్లోనే ఆయన తన 100వ చిత్రాన్ని చేయనున్నాడు. ఎన్నో ప్రయోగాలు మరెన్నో వినూత్నమైన సినిమాలను చేసి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నాగార్జున ఆయన కెరీర్లో చేసిన శివ సినిమాతో భారీ స్థాయిలో ఇమేజ్ అందుకున్నాడని చెప్పవచ్చు. నాగార్జున కెరియర్ శివ సినిమాకి ముందు ఒకలా శివ సినిమా తర్వాత ఒకలా ఉందని చెప్పవచ్చు.

 భక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా కుటుంబ కథా చిత్రాలు మాస్ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన నాగార్జున ఇప్పటిదాకా 100 కోట్ల క్లబ్ లోకి రాక పోవడం నిజంగా ఆయనకు ఇన్ సల్ట్ అనిపించే విషయమే అని చెప్పాలి.అయితే తను తొందరలో చేయబోయే వందో సినిమా తో వంద కోట్ల క్లబ్బు లో చేరడం ఖాయమని చెబుతున్నాడు నాగార్జున. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్ లో ఆయన ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బంగార్రాజు చిత్రాన్ని జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన నాగార్జున తన తదుపరి సినిమాలపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 
బంగార్రాజు చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా సంక్రాంతికి రాబోతున్న ఏకైక పెద్ద హీరో సినిమా ఇదే కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో నాగార్జున తన వందో సినిమా గురించి చెప్పాడు. ఇది తన కెరీర్లో ఎప్పుడూ రాని విధంగా గా ఉంటుంది అన్నారు. తప్పకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అని ఆయన వెల్లడించారు. దాంతో అక్కినేని అభిమానులలో ఎంతో సంతోషం నెలకొంది. తమ హీరో తొందర లోనే భారీ బడ్జెట్ సినిమాలలో నటించడం అందులోనూన్అది ఆయన 100వ సినిమా కావడం నిజంగా గొప్ప విషయం అని వారు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: