ఒక సినిమా విడుదలైన తర్వాత అది సాధించే విజయాన్ని బట్టి ఆ సినిమా కి పనిచేసిన వారి కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. కొంతమంది ఒక సినిమాకి తమ జీవితాన్ని పణంగా పెట్టి జీవితాన్ని త్యాగం చేసి మరీ ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. కొంతమంది కొద్ది సమయం మాత్రమే సినిమా కోసం అర్పించి దాని ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తూ ఉంటారు. అలా ఏం చేసిన సినిమా కోసమే చేస్తూ వారు సినిమా నే ఊపిరి గా బ్రతుకుతూ ఉంటారు.

ఆవిధంగా టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే ఓ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆ చిత్ర బృందం ఇప్పుడు చెబుతుండడం విశేషం. అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని నాగార్జున హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. 

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమా కథను ఐదేళ్లుగా రాస్తూనే ఉన్నాను అని ల, తీయడానికి నాలుగు నెలల సమయం మాత్రమే పట్టిన రాయడానికి హీరో ను ఒప్పించడానికి ఐదేళ్ల సమయం పట్టిందని దీనికోసం నా జీవితంలోని ప్రధాన భాగం సమయాన్ని వెచ్చించానని ఆయన చెప్పాడు. మరి దర్శకుడు పడ్డ ఈ కష్టానికి ఫలితం దక్కడానికి ఎన్నో రోజులు లేవు కాబట్టి ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. కృతి శెట్టి నాగచైతన్య కు జోడిగా నటిస్తు ఉండగా రమ్య కృష్ణ నాగార్జునకు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం సినిమా లాగా సూపర్హిట్ టాక్ తెచ్చుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: