క్రేజీ బ్యూటీ 'రష్మిక మందన్నా'  ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఈమె నటించడానికి కారణం సమంత అంటూ వార్తలు కూడా వచ్చాయి.  అయితే రష్మిక సినిమాకు సామ్ కి సంబంధం ఏమిటి అనే ప్రశ్న చాలా మందికి కలుగుతోంది. అయితే ఈ సినిమా దర్శకుడు మరెవరో కాదు సమంత స్నేహితుడు రాహుల్ రవీంద్రన్.  అయితే ఈయన కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది కానీ తను నటించిన సినిమాలు హిట్ కాలేదు. హీరోగా విజయాన్ని అందుకోలేక పోయినప్పటికి డైరెక్టర్ మాత్రం మంచి విజయాన్ని అందుకున్నాడు. 

అందుకే మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను ఎందుకు తీసుకున్నాడు అంటే కేవలం సమంత చెప్పిందని. అయితే ఈ డైరెక్టర్ మొదటగా సమంతతో ఈ సినిమాను చేయాలనుకున్నాడు. కథ విన్న సమంత ఈ సినిమాను నాతో చేయడం కంటే రష్మికతో చేయడమే కరెక్ట్ అంటూ... సామ్ స్వయంగా రష్మికకు ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పిందట.. దయచేసి ఈ సినిమా చేయమని అడిగిందట సామ్. ఇక డైరెక్టర్ కథవిన్న రష్మికసినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే...

ఒక దివంగత మాజీ పీఎం పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల.. ఓ కిరాణా కొట్టు పెట్టుకున్న యువతి అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ ఉమెన్‌ గా ఎలా మారింది ? ఇంకా ఆ ఎదిగే సమయంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి ? అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ కథాంశం అని సమాచారం. ఇకపోతే ఈ డైరెక్టర్ కి మన్మథుడు 2 పరాజయం తర్వాత డైరెక్టర్‌గా అవకాశం రాలేదు. ఈ సినిమా ఛాన్స్ కూడా సమంత కారణంగా వచ్చింది. మొత్తం మీద ఇప్పటి వరకూ రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు నటించలేదు. కానీ ఇప్పుడు సమంత వల్ల మొదటి సారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది  మరి ఈ ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే ఈ అమ్మడు నుంచి మరిన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టు ఆశించవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: