నటన పరంగా హీరోయిన్ ప్రియమణి తన పెర్ఫార్మెన్స్ ని బాగానే కొనసాగిస్తుందని చెప్పవచ్చు. సినిమాలలోనూ, పలు షో లలో మంచి ఆఫర్లను కొట్టేస్తోంది ప్రియమణి. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి హీరోయిన్ గా కంటే ఎక్కువ అవకాశాలను కొట్టేస్తోంది. ఇలాంటివి కేవలం కొంతమంది హీరోయిన్లకే సాధ్యమవుతుంది. ది ఫ్యామిలీ మాన్ -2 వెబ్ సిరీస్ లో కూడా ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఎలాంటి పాత్ర అయినా సరే తనదైన స్టైల్ లో చేస్తూ ఉంటుంది ప్రియమణి.

ప్రస్తుతం ప్రియమణి తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలుపుకొని 7  భాషలలో నటిస్తోంది ప్రియమణి. ఇందులో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా హీరో రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వంలో కూడా.. ప్రియమణి నక్సలైట్ పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో నారప్ప మూవీ విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఇందులో డీ గ్లామరస్గా కనిపించింది ప్రియమణి. 


ఇక విరాటపర్వంలో కూడా ఇలాగే కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అలాగే హీరో అజయ్ దేవగన్ తో కూడా బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఆ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. అలాగే హీరో షారుఖ్ ఖాన్ తో కూడా మూవీలో నటించనుంది.
ఇక సినిమాలలోనే కాకుండా.. మరొక వైపు ఢీ వంటి ప్రోగ్రాంలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది ..తాజాగా ప్రియమణి పై కొన్ని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. తన భర్త తో ఈమె విడిపోతుందని తో వార్తలు ఎక్కువగా వినిపించాయి.


 కానీ ఇలాంటి విషయాలకు పులిస్టాప్ పెట్టే విధంగా దీపావళి వేడుకలో జంటగా కనిపించి షాకిచ్చింది. ప్రియమణి భర్త bollywood ACTOR' target='_blank' title='ముస్తఫా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముస్తఫా రాజ్ తన వృత్తి పరంగా కొద్దిరోజులు అమెరికాలో ఉన్నారట ప్రియమణి ఇండియాలోనే ఉండడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి అని సమాచారం.తాజాగా హాట్ ఫోటో షూట్ లో టీనేజ్ గర్ల్ గా మారిపోయింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: