ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఏకంగా ఆయన మూడేళ్ల పాటు వర్క్ చేశారు. సరే జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం టైం కేటాయించాల్సి ఉంది. కనుక అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ ఆ సినిమా పూర్తి అయి కూడా చాలా నెలలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రారంభం అవ్వలేదు. ఆర్‌ ఆర్ ఆర్ సినిమా లో నటించిన మరో హీరో రామ్ చరణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా ను పూర్తి చేశాడు శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు.

మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు చర్చలు ప్రారంభించాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు అంటూ విమర్శలు రావడం చాలా సహజం. అభిమానుల అసంతృప్తిని పసిగట్టిన ఎన్టీఆర్ సంక్రాంతి కానుకగా వాళ్లకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో అనే విషయం తెలిసిందే.

ఆచార్య సినిమాను ముగించిన కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసమే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సరైన హిట్టును ఇచ్చేందుకు కొరటాల శివ ఎదురు చూస్తున్నాడు. సంక్రాంతి కి సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను ఇవ్వడం కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక కాన్సెప్ట్ పోస్టర్ను లేదా ఏదైనా ఒక ఆసక్తికర విషయాన్ని సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ మరియు కొరటాల షేర్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అస్సలుకే ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడట ఈ నందమూరి చిన్నోడు.అదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ డబుల్ ఎంటర్టైన్మెంట్ మరియు సంతోషాన్ని ఇవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: