యాంకర్ గా ఇప్పుడు అగ్ర స్థానాన్ని అందుకుని టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. ఆమె కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె మధ్యలో కొన్ని సినిమాలు చేసి చివరకు యాంకర్ గానే కొనసాగుతోంది. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ నటిగా వెలుగొందుతోంది అనసూయ. ఆమె ప్రస్తుతం మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రష్మీ కూడా మొదట్లో కొన్ని చిత్రాలతో ఆలరించిన కూడా పెద్దగా పేరు రాలేదు ఆమెకు.
ఎప్పుడైతే యాంకర్ గా అడుగు పెట్టిందో అప్పుడు మంచి క్రేజ్ అందుకని ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టి స్టార్ నటిగా స్థిరపడిపోయింది. రెజీనా కూడా మొదట్లో యాంకర్ గా పలు షోలు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రముఖ షో కి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకొని ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఇప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు రావడం విశేషం.